Jio అఫర్: రీఛార్జ్ కొట్టు బర్గర్ పట్టు..జియో వాలంటైన్స్ డే అఫర్ అదిరిందిగా.!
వాలంటైన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో వినూత్న అఫర్
వాలంటైన్స్ డే రోజున చేసే రీఛార్జ్ పైన McDonald’s బర్గర్ ఉచితంగా అందిస్తుందని ప్రకటించింది.
రిలయన్స్ జియో అఫర్ మరియు దాని వివరాల పైన ఒక లుక్కేద్దామా
వాలంటైన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో వినూత్నమైన అఫర్ ను తన వినియోగదారుల కోసం ప్రకటించింది. ఫిబ్రవరి 14వ తేదీ' 2023 వాలంటైన్స్ డే రోజున చేసే మొబైల్ రీఛార్జ్ పైన McDonald’s బర్గర్ ను ఉచితంగా అందిస్తుందని ప్రకటించింది. అంతేకాదు, రీఛార్జ్ తో అంధివచే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటుగా మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రిలయన్స్ జియో అందించిన ఈ వినూత్నమైన అఫర్ మరియు దాని వివరాల పైన ఒక లుక్కేద్దామా.
Surveyవాలంటైన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో ప్రకటించిన వాలంటైన్స్ డే అఫర్ విషయానికి వస్తే, ఈ అఫర్ కేవలం రూ.349, రూ.899 మరియు రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ లకు మాత్రమే వర్తిస్తుంది. వాలంటైన్స్ డే రోజు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసే కస్టమర్లు ఈ క్రింద సూచించిన అదనపు ప్రయోజనాలను అందుకుంటారు.
ఈ రీఛార్జ్ ద్వారా 12GB అదనపు హై స్పీడ్ డేటా అందుకుంటారు. అలాగే, రూ.199 అంతకంటే ఎక్కువ కొనుగోలు పైన McDonald’s బర్గర్ ఉచిత వోచర్ ను (McAloo Tikki/Chicken Kebab) మీరు పొందుతారు. ఇది మాత్రమే కాదు, రూ.199 అంతకంటే ఎక్కువగా చేసే Ferns&Petals కొనుగోళ్ల పైన రూ.150 తగ్గింపు కూడా పొందవచ్చు. అంతేకాదు,ixigo ద్వారా చేసే ఫ్లయిట్ టికెట్ బుకింగ్ పైన రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, మీ టికెట్ బుక్ వాల్యూ 4,500 రూపాయల కంటే పైన ఉండాలి. అంటే, జియో వాలంటైన్స్ డే అఫర్ అదిరిందిగా అనే చెప్పాలి. పైన సూచించిన ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.
Jio Rs.349 Plan
జియో కొత్తగా ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
Jio Rs.899 Plan
జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.
Jio Rs.2,999 Plan
జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile