జియో ట్రిపుల్ ప్లే ప్లాన్ : టీవీ, గిగా ఫైబర్ మరియు అన్ని ఇతర సర్వీసులు అన్నిఒక్కచోట : రిపోర్ట్

Updated on 04-Sep-2019
HIGHLIGHTS

ప్రస్తుతం, దాని ఉద్యోగులకు మాత్రమే ఈప్లాన్ అందుబాటులో ఉంది.

టెలికాం రంగంలో,  రిలయన్స్ జీయో తన పోటీదారులు ఊహించని ధరలతో 4 జి సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని సంస్థ, దాని రిలయన్స్ జియో గిగా ఫైబర్ FTTH సేవని త్వరలోనే అదేవిధంగా తీసుకురావాలని చూస్తోంది. ఈ సంస్థ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, జీయో టీవీ సబ్ స్క్రిప్షన్  మరియు జియో ఆప్స్ అన్నింటిని కూడా కేవలం ఒకే ప్లానుతో అందించేలా, ఒక కొత్త "ట్రిపుల్ ప్లే" ప్లాన్ను తీసుకురావడానికి చూస్తున్నట్లు, టెలికాం టాక్ యొక్క ఒక రిపోర్ట్ చెబుతోంది .

ప్రస్తుతానికి  ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్ గురించి అంతగా తెలియదు కానీ, కంపెనీ యొక్క వెబ్సైట్ లో  Jio GigaFiber ఖాతాలో లాగ్ ఇన్ అయినప్పుడు కనిపించింది. అయితే, ఈ ప్లాన్ ధర ఇంకా తెలియరాలేదు. ఈ నివేదిక ప్రకారం, GigaFiber ట్రిపుల్ ప్లాన్ 100GB హై-స్పీడ్ డేటా (100 Mbps వేగంతో), అపరిమిత వాయిస్ కాలింగ్,  Jio ఆప్స్ యొక్క పోర్ట్ఫోలియో యాక్సెస్ మరియు Jio Home TV సబ్ స్క్రిప్షన్ని అందిస్తుంది. జీయో హోమ్ టివి సబ్ స్క్రిప్షన్ గురించి ప్రస్తావిస్తూ, సంస్థ యొక్క IPTV సేవను Jio Home TV అని పిలుస్తారని తెలిపింది. ఈ ప్లాన్ ఒక 28-రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జీయో ఫైబర్ వెబ్సైట్ ప్రకారం, రోజుకు 500GB డేటా పరిమితితో వినియోగదారులకు 50MBPS వేగం అందించే ఒక ప్రాథమిక రూ.500 ప్లాన్ ఉంది. అలాగే, రూ. 999 ప్లానుతో 30 రోజులకుగాను 100MBPS స్పీడ్ మరియు 600GB డేటాను అందిస్తుంది. అయితే, భారీస్థాయిలో ఇంటర్నెట్ వినియోగం అవసరమున్న  వారికి 150 MBPS వేగంతో, 900 GB డేటా మరియు 30 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది, అదికూడా  కేవలం 1,500 రూపాయల వరకు ఎంపిక చేసుసుకునే విధంగా.

Jio సంస్థ, ఇప్పటికే ముంబై మరియు ఢిల్లీ వంటి నగరాల్లో దాని FTTH సేవలను పరీక్షించడం జరిగింది మరియు వాణిజ్యపరంగా త్వరలోనే భారతదేశం అంతటా దాని సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ టెస్ట్ నిర్వహించడంలో కొంత ఆలస్యం అయిందని ఒక నివేదిక పేర్కొంది మరియు సంస్థ తన GigaFiber సేవ కోసం  (RFS) అమ్మకానికి కోసం సిద్ధంగా ఉంది. ఏరియా RFS అంటే,  ప్రధానంగా అధికారకంగా సేవలను గురించి చెప్పటానికి మరియు ఈ విస్తరణను ప్రజలకు అందించదానికి సిద్దమవుతున్నట్లు అర్థం.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :