జియో ధమాకా అఫర్: ధమాకా అఫర్ ను తిరిగి తీసుకొచ్చిన జియో
Jio కష్టమర్ల కోసం ధమాకా అఫర్ ను తిరిగి తీసుకొచ్చింది
ఈ ప్లాన్ కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది
ఈ ప్లాన్ 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు పెంచిన తరువాత ప్లాన్స్ అందించే ప్రయోజాలలో మార్పులు చేసింది. కొన్నింటిలో వ్యాలిడిటీ కాలంలో మార్పులు చేస్తే మరికొన్నింటిలో Disney+ Hotstar లేదా Prime Video వంటి ఇతర ప్రయోజాలలో మార్పులు చేసింది. అయితే, ఇప్పుడు కష్టమర్ల కోసం ధమాకా అఫర్ ను తిరిగి తీసుకొచ్చింది. అదే రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.
SurveyJio Rs.499 Plan
ఈ ప్లాన్ కస్టమర్లకు అధికలాభాలను అందిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అధనంగా, పైన తెలిపిన విధంగా ఈ ప్లాన్ 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. కొత్త వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌కు కూడా సభ్యత్వాన్ని కూడా అందుకుంటారు.
Jio Rs.799 Plan కూడా ఇదే విధమైన అధిక లాభాలను అందిస్తుంది. రూ. 799 ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 1 సంవత్సరం 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.
మరిన్ని Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile