ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ Netflix సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుకనే ఛాన్స్ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ప్రకటించింది. అయితే, ఇది ప్రతీ యూజర్ కోసం కాదండోయ్. రిలయన్స్ జియో Netflix OTT ప్లాట్ ఫామ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో జతగా లాంచ్ చేసిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రామే ఈ అవకాశం దక్కుతుంది. మీరు కూడా ఈ ఉచిత OTT సౌలాభ్యాన్ని అందుకోవాలనుకుంటే Reliance Jio కొత్తగా తీసుకు వచ్చిన ఆ ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిందే.
Survey
✅ Thank you for completing the survey!
Jio Netflix Plans:
రిలయన్స్ జియో ఇటీవల Netflix సబ్ స్క్రిప్షన్ తో ఓక్ రెండు కొత్త ప్లాన్ లను తన పోర్ట్ ఫోలియోలో జత చేసింది. అవే, రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ రెండు ప్లాన్స్ కూడా ఉచిత Netflix OTT సబ్ స్క్రిప్షన్ తో వస్తాయి. ఈ రెండు ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు ఏమిటో క్రింద చూడవచ్చు.
ఈ జియో ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు అవుతుంది మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB 4G డేటా చొప్పున పూర్తి వ్యాలిడిటీ కాలానికి టోటల్ 168 GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, డైలీ 100 SMS సౌకర్యం కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. ఈ ప్లాన్ Unlimited Ture 5G Data అఫర్ తో కూడా వుంది కాబట్టి అన్లిమిటెడ్ 5G డేటాని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ తో ఉచిత Netflix OTT సబ్ స్క్రిప్షన్ మరియు Jio Cinema, Jio TV మరియు Jio Cloud యాక్సెస్ కూడా జియో అందిస్తోంది.
Jio Rs. 1,499 Plan:
ఈ జియో ప్లాన్ కూడా అదే 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు డైలీ 3GB 4G డేటా చొప్పున పూర్తి చెల్లుబాటు కాలానికి గాను మొత్తం 292 GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS సౌలభ్యాన్ని కూడా మీరు పొందుతారు. ఈ ప్లాన్ కూడా Unlimited Ture 5G Data తో వస్తుంది కాబట్టి అన్లిమిటెడ్ 5G డేటాని మీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ తో కూడా ఉచిత Netflix OTT సబ్ స్క్రిప్షన్ మరియు Jio Cinema, Jio TV మరియు Jio Cloud యాక్సెస్ కూడా జియో అందిస్తోంది.