Jio గుడ్ న్యూస్: కేవలం రూ. 15 ధరకు కూడా అన్లిమిటెడ్ లాభాలు జియో ఆఫర్ చేస్తోంది.!
జియో యూజర్లకు కంపెనీ గొప్ప లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలానే అందించింది
జియో ఇప్పుడు కేవలం రూ. 15 ధరకు కూడా అన్లిమిటెడ్ లాభాలు జియో ఆఫర్ చేస్తోంది
కేవలం రూ. 15 తో కూడా మీరు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా అందుకోవచ్చు
Jio గుడ్ న్యూస్: రిలయన్స్ జియో యూజర్లకు కంపెనీ గొప్ప లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలానే అందించింది. అయితే, అతి చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్స్ ని ఇప్పుడు కొత్తగా పరిచయం చేసింది. జియో ఇప్పుడు కేవలం రూ. 15 ధరకు కూడా అన్లిమిటెడ్ లాభాలు జియో ఆఫర్ చేస్తోంది. అంటే, ఇప్పుడు కేవలం రూ. 15 రూపాయలతో కూడా మీరు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా అందుకోవచ్చు.
Jio గుడ్ న్యూస్: ఏమిటి ఈ ప్లాన్
యూజర్లకు అధిక డేటాని నామ మాత్రపు ధరలో అందించడమే లక్ష్యంగా జియో రూ. 15 రూపాయల అన్లిమిటెడ్ డేటా ప్లాన్ ని అందించింది. ఇది కేవలం డేటా మాత్రమే అందించే డేటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఇది ఒక రోజు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఇక ఈ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాల విషయానికి వస్తే, ఈ డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 5జి నెట్ వర్క్ పైన 24 గంటలు పాటు అన్లిమిటెడ్ డేటా వినియోగం కోసం యాక్సెస్ అందిస్తుంది. అలాగే, 4జి నెట్ వర్క్ పైన 200MB డేటా కూడా అందిస్తుంది. అలాగే, ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 60Kbps వేగంతో 24 గంటల అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.
ఇంకా ఏమైనా బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయా?
అవును, బడ్జెట్ ధరలో డేటాతో పాటు మరిన్ని లాభాలతో వచ్చే మరో బెస్ట్ డేటా ప్లాన్ ఉంది. అదే, రూ. 55 డేటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ డేటా ఓన్లీ ప్రీపెయిడ్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మూడు రోజులకు 3GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, ఈ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 60Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.
ఈ డేటా ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ తో OTT బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. అదేమిటంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఏకంగా 1000+ live TV ఛానల్స్ కి యాక్సెస్ అందిస్తుంది. ఇందులో Star Plus HD, Colors HD, Sun TV HD, ETV HD మరియు ETV Telugu వంటి అనేక ఛానళ్లు ఉన్నాయి.
జియో ఇప్పుడు యూజర్ల అవసరానికి తగిన ఒకరోజు నుంచి వన్ ఇయర్ ఇయర్ వరకు అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. యూజర్లు వారి బడ్జెట్ మరియు వారి అవసరాలకు తగిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఎంచుకుని రీఛార్జ్ చేసే అవకాశం జియో తన యూజర్ల కోసం అందించింది.