Jio New Plans: IPL 2024 కోసం రెండు కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో.!

Updated on 18-Mar-2024
HIGHLIGHTS

IPL 2024 కోసం అందరూ చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు

ఐపిఎల్ కోసం Jio సౌకర్యవంతమైన రెండు కొత్త ప్లాన్ లను కూడా తీసుకు వచ్చింది

ఐపిల్ 2024 కోసం అధిక డేటాని ఆఫర్ చేసే రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్ వచ్చాయి

Jio New Plans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) కోసం అందరూ చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 22 March 2024 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభం అవుతుంది. ఐపిఎల్ ను ఉచితంగా చూసే అవకాశం అందించిన జియో ఇప్పుడు ఐపిఎల్ కోసం మరింత సౌకర్యవంతమైన రెండు కొత్త ప్లాన్ లను కూడా తీసుకు వచ్చింది.

Jio New Plans For IPL 2024

రిలయన్స్ జియో ఐపిల్ 2024 కోసం అధిక డేటాని ఆఫర్ చేసేలా ఈ రెండు కొత్త ప్లాన్ లను విడుదల చేసింది. ఈ ప్లాన్ లను డేటా ప్రత్యేకమైన ప్లాన్స్ గా తీసుకు వచ్చింది. అంటే, ఈ రెండు ప్లాన్ లు కూడా డేటాని మాత్రమే అందిస్తాయి. అయితే, ఈ ప్లాన్ లతో మంచి వ్యాలిడిటిని అందుకునే వీలుంది.

జియో రూ. 444 ప్లాన్

Jio Rs.444 Plan

రిలయన్స్ కొత్త ప్రకటించిన ప్లాన్ లవ్ ఇది సరసమైన ధరకే వస్తుంది. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 100 GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. అంతేకాదు, ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత కూడా అన్లిమిటెడ్ గా డేటాని వినియోగించుకోవచ్చు. అయితే, డేటా లిమిట్ ముసగిన తరువాత స్పీడ్ 64 Kbps కి తగ్గించ బడుతుంది.

Also Read: OnePlus Nord CE4 కొత్త ఫీచర్స్ తో టీజర్ విడుదల చేసిన కంపెనీ.!

జియో రూ. 667 ప్లాన్

Jio New Rs. 666 Plan

ఇక ఈ జియో రూ. 667 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ కూడా కేవలం డేటాని ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు 150 GB డేటాని అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత కూడా అన్లిమిటెడ్ గా డేటాని వినియోగించుకోవచ్చు. అయితే, డేటా లిమిట్ ముసగిన తరువాత స్పీడ్ 64 Kbps కి తగ్గించ బడుతుంది.

కానీ, రెండు ప్లాన్ లతో ఎటువంటి కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు మాత్రం అందించదు. ఈ ప్లాన్ లతో కేవలం డేటాని మాత్రమే అందుకుంటారు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :