Jio New Plans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) కోసం అందరూ చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 22 March 2024 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభం అవుతుంది. ఐపిఎల్ ను ఉచితంగా చూసే అవకాశం అందించిన జియో ఇప్పుడు ఐపిఎల్ కోసం మరింత సౌకర్యవంతమైన రెండు కొత్త ప్లాన్ లను కూడా తీసుకు వచ్చింది.
Survey
✅ Thank you for completing the survey!
Jio New Plans For IPL 2024
రిలయన్స్ జియో ఐపిల్ 2024 కోసం అధిక డేటాని ఆఫర్ చేసేలా ఈ రెండు కొత్త ప్లాన్ లను విడుదల చేసింది. ఈ ప్లాన్ లను డేటా ప్రత్యేకమైన ప్లాన్స్ గా తీసుకు వచ్చింది. అంటే, ఈ రెండు ప్లాన్ లు కూడా డేటాని మాత్రమే అందిస్తాయి. అయితే, ఈ ప్లాన్ లతో మంచి వ్యాలిడిటిని అందుకునే వీలుంది.
రిలయన్స్ కొత్త ప్రకటించిన ప్లాన్ లవ్ ఇది సరసమైన ధరకే వస్తుంది. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 100 GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. అంతేకాదు, ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత కూడా అన్లిమిటెడ్ గా డేటాని వినియోగించుకోవచ్చు. అయితే, డేటా లిమిట్ ముసగిన తరువాత స్పీడ్ 64 Kbps కి తగ్గించ బడుతుంది.
ఇక ఈ జియో రూ. 667 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ కూడా కేవలం డేటాని ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు 150 GB డేటాని అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత కూడా అన్లిమిటెడ్ గా డేటాని వినియోగించుకోవచ్చు. అయితే, డేటా లిమిట్ ముసగిన తరువాత స్పీడ్ 64 Kbps కి తగ్గించ బడుతుంది.
కానీ, రెండు ప్లాన్ లతో ఎటువంటి కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు మాత్రం అందించదు. ఈ ప్లాన్ లతో కేవలం డేటాని మాత్రమే అందుకుంటారు.