Jio Home offers 3 in 1 home pack at rs 400 starting price with best benefits
Jio Home : రిలయన్స్ జియో వినియోగదారుల కోసం Jio Home 3-in-1 హోమ్ ప్యాక్ ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ తో ఇంటర్నెట్, టీవీ మరియు OTT సేవలు కూడా కేవలం ఒకే రీచార్జ్ లో పొందే అవకాశం కల్పించింది. అంటే, బ్రాడ్ బ్యాండ్, DTH మరియు OTT సబ్ స్క్రిప్షన్ కోసం సపరేట్ గా రీఛార్జ్ చేసే అవసరం లేకుండా కేవలం ఒకే ప్యాక్ లో అన్ని సేవలు ఈ ప్లాన్ అందిస్తుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను, జియో ఈ ప్లాన్ తో ఒక దెబ్బకు మూడు పిట్టలు గా మార్చింది.
జియో కొత్తగా అందించిన ఈ 3-in-1 ప్యాక్ లో అన్‌లిమిటెడ్ హై-స్పీడ్ Wi-Fi, 1000 కు పైగా డిజిటల్ Live TV ఛానళ్లు మరియు 12 కు పైగా ప్రముఖ OTT యాప్ యొక్క యాక్సెస్ లభిస్తుంది. Netflix, Prime Video, Jio Hotstar, Sony LIV, ZEE5 మరియు Sun NXT వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ లు ఎంపిక చేసిన ప్లాన్ ను బట్టి అందుబాటులో ఉంటాయి. ఇందులో మంచి విషయం ఏమిటంటే, ఈ సర్వీస్ ప్లాన్ ను కేవలం రూ. 400 రూపాయల అతి తక్కువ ప్రారంభ రేటు నుంచి ఆఫర్ చేస్తోంది.
జియో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో మూడు రకాల ప్లాన్ లను అందిస్తోంది. వీటిలో TV Only ప్లాన్ లో కేవలం లైవ్ టీవీ ఛానళ్లు ఆఫర్ చేస్తుంది. అలాగే, Wi-Fi Only ప్లాన్ లో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అందిస్తుంది. అయితే, కొత్త 3-in-1 ప్లాన్ తో Wi-Fi, లైవ్ టీవీ, OTT సేవలు అన్నీ ఒకే ప్యాక్ లో లభిస్తాయి. దీంతో ఒకే కనెక్షన్ తో పూర్తి డిజిటల్ వినోదం మరియు ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
Also Read : POCO M8 Power 5G: పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చిన పోకో కొత్త ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఎంపిక చేసిన ప్లాన్ ను బట్టి 30 Mbps నుంచి 100 Mbps లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. అలాగే, కొత్త కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు కొన్ని ఆఫర్లలో ఉచిత ఇన్‌స్టాలేషన్, నిర్వహణ వంటి ప్రయోజనాలు కూడా లభించవచ్చు. కొన్ని ప్రమోషనల్ ఆఫర్లలో రెండు నెలల రీచార్జ్ పై ఒక నెల అదనపు సర్వీస్ వంటి ప్రయోజనాలను కూడా జియో ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్లు ప్రాంతం మరియు ప్లాన్ ను బట్టి మారవచ్చు.
జియో కొత్తగా అందించిన ఈ 3 ఇన్ 1 హోమ్ ప్లాన్ లతో కంప్లీట్ హోమ్ నీడ్ ని ఫుల్ ఫిల్ చేస్తుంది. అంటే, ఇంట్లో వేగవంతమైన ఇంటర్నెట్, వేలాది టీవీ ఛానళ్లు మరియు అనేక OTT ప్లాట్ ఫామ్ యాక్సెస్ కూడా తక్కువ ఖర్చుతో ఈ లేటెస్ట్ జియో 3 ఇన్ 1 ప్యాక్ అందిస్తుంది.