POCO M8 Power 5G: పవర్ ఫుల్ ఫీచర్స్ తో వచ్చిన పోకో కొత్త ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

పోకో ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

POCO M8 Power 5G ను పవర్ ఫుల్ ఫీచర్స్ తో మార్కెట్లో పరిచయం చేసింది

ఈ లేటెస్ట్ ఫోన్ పై ఫస్ట్ డే బిగ్ డీల్స్ కూడా కంపెనీ అందించింది

POCO M8 Power 5G: పోకో ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, ఒప్పో ఎం8 పవర్ 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను పవర్ ఫుల్ ఫీచర్స్ మరియు మిడ్ రేంజ్ ధరతో ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ మరియు మంచి పెర్ఫార్మన్స్ అందించే లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయింది. ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.

POCO M8 Power 5G: ప్రైస్

ఈ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ని రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు హైఎండ్ (8GB + 128GB) వేరియంట్ ని రూ. 27,999 ప్రైస్ తో పోకో ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లేజ్ ఆరెంజ్ మరియు గ్రీన్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ మొదటి రోజైన ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ లేటెస్ట్ ఫోన్ పై ఫస్ట్ డే బిగ్ డీల్స్ కూడా కంపెనీ అందించింది.

ఫస్ట్ డే సేల్ ఆఫర్స్

ఈ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ డే సేల్ కోసం పోకో ప్రత్యేకమైన ఆఫర్లు అందించింది. ఆగస్టు 7వ తేదీ జరిగే ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ లో ఈ ఫోన్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. అలాగే, రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC, ICICI, మరియు SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫస్ట్ డే ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 21,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read : Freedom Sale కంటే ముందే iPhone 16 పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ చేసిన Flipkart

POCO M8 Power 5G: కంప్లీట్ ఫీచర్స్

పోకో ఈ ఫోన్ ను పెద్ద 6.99 ఇంచ్ FHD+ రిజల్యూషన్ AMOLED తో లాంచ్ చేసింది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మంచి బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రీమియం మాట్టే ఫినిష్ బ్యాక్ ప్యానల్, చుట్టూ మెటల్ ఫ్రేమ్ మరియు ముందు గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్ వంటి పటిష్టమైన డిజైన్ కలిగిఉంది. ఇవి కాకుండా IP65 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon Gen 4 ప్రాసెసర్, 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మన్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది. ఈ ఫోన్ 4 జనరేషన్ OS అప్‌గ్రేడ్స్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకుంటుంది.

కెమెరా సెటప్ పరంగా, ఈ పోకో కొత్త ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది FHD మరియు HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, ఇందులో AI ఫోటోగ్రఫీ ఫీచర్ ని అందించడం వలన గొప్ప ఫోటోలు అందిస్తుంది.

ఈ ఫోన్ లో అందించిన మరో ముఖ్యమైన ఫీచర్ ఈ ఫోన్ బ్యాటరీ. పోకో ఈ ఫోన్ ను 8000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ చేసింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీ మరియు ఇది దాదాపు 3 రోజుల బ్యాకప్ అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :