Freedom Sale కంటే ముందే iPhone 16 పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ చేసిన Flipkart
Flipkart Freedom Sale కంటే ముందే iPhone 16 పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది
రీజనబుల్ ధరలో లేటెస్ట్ ఐఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ని పరిశీలించవచ్చు
రెండు ఆఫర్స్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది
Flipkart Freedom Sale కంటే ముందే iPhone 16 పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రీజనబుల్ ధరలో లేటెస్ట్ ఐఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ని పరిశీలించవచ్చు. ఎందుకంటే, 67 వేల రూపాయల ధరతో సేల్ అవుతున్న ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం 60 వేల రూపాయల ఆఫర్ ధరలో మీరు అందుకోవచ్చు.
SurveyiPhone 16 : ఈరోజు ఆఫర్ ఏమిటి?
యాపిల్ ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 79,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఐఫోన్ 17 ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ ప్రైస్ ను యాపిల్ తగ్గించింది. అయినా కూడా ఈ ఫోన్ 70 వేల రూపాయల ధరలో సేల్ అయ్యేది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ ను రూ. 67,900 ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ పై మరో రెండు ఆఫర్స్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ ఐఫోన్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,295 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ అందుకుంటే, ఈ యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 60,605 రూపాయల ఆఫర్ ధరకే మీకు లభిస్తుంది.
Also Read : OnePlus N6x ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి.!
iPhone 16 : ఫీచర్స్
ఐఫోన్ 16 ఫోన్ యాపిల్ యొక్క లేటెస్ట్ A18 Chip తో పని చేస్తుంది మరియు బేసిక్ వేరియంట్ 128 GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ DSLR లాంటి గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందించే పవర్ ఫీల్ కెమెరా సిస్టం కలిగి ఉంటుంది. ఇది Dolby Vision మరియు 4K వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ లో 6.1 ఇంచ్ సినిమాటిక్ సూపర్ రెటినా XDR స్క్రీన్ ఉంటుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా గొప్పగా ఉంటుంది. ఈ స్క్రీన్ 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ యాపిల్ ఫోన్ iOS 18 తో వస్తుంది మరియు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం తో అప్డేట్ అవుతుంది. ఈ ఫోన్ బ్లాక్, పింక్, టీల్, అల్ట్రా మెరైన్ మరియు వైట్ తో మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
