do not miss OnePlus N6x first sale big deals
OnePlus N6x స్మార్ట్ ఫోన్ గతవారం ఇండియాలో లాంచ్ అయింది మరియు ఈరోజు మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన లాంచ్ ఆఫర్స్ ని ఈ ఫోన్ పై అందించింది. అయితే, ఈ ఫోన్ పై అందించిన డీల్స్ కేవలం కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ పీరియడ్ డీల్స్ మాత్రమే. కాబట్టి, ఈ ఫోన్ ను ముందుగా తీసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి.
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ ఉంది.
అయితే, ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఎలాగంటే, ఈ ఫోన్ పై వన్ ప్లస్ ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ పై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,499 మరియు రూ. 19,499 రూపాయల ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. ఇది కాకుండా 6 నెలల Bajaj నో కాస్ట్ EMI ఆఫర్ కూడా అందించింది ఈ ఫోన్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.
Also Read : Vivo T5 Lite vs OPPO K14x: ఈ రెండు ఫోన్స్ లో ఏ 5G ఫోన్ కొనాలి.!
ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే HD + రిజల్యూషన్ జతగా 120Hz రిజల్యూషన్ తో మంచి స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది మరియు 900 HBM పీక్ బ్రైట్నెస్ తో బ్రైట్ విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6360 Apex ప్రాసెసర్ వస్తుంది మరియు జతగా 4GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబులిటీ సర్టిఫికేషన్ తో చాలా దృఢమైన డిజైన్ లో ఉంటుంది.
ఈ ఫోన్ 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ లో ముందు 5MP సెల్ఫీ కెమెరా ని వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ కెమెరాతో లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్, వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్లు మరియు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ ను మంచి స్లీక్ డిజైన్ లో భారీ 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది.