Vivo T5 Lite vs OPPO K14x: ఈ రెండు ఫోన్స్ లో ఏ 5G ఫోన్ కొనాలి.!

HIGHLIGHTS

Vivo T5 Lite vs OPPO K14x రెండు స్మార్ట్ ఫోన్ లలో ఏది బెటర్ ఆప్షన్

ఈ రెండు ఫోన్లు కూడా పెద్ద బ్యాటరీ, 5G కనెక్టివిటీ కలిగి ఉంటాయి

ఛార్జింగ్, సాఫ్ట్‌వేర్ వంటి కొన్ని అంశాల్లో కొన్ని కీలక తేడాలు ఉన్నాయి

Vivo T5 Lite vs OPPO K14x: ఈ రెండు ఫోన్స్ లో ఏ 5G ఫోన్ కొనాలి.!

Vivo T5 Lite vs OPPO K14x : ఇండియాలో లేటెస్ట్ విడుదలైన రెండు స్మార్ట్ ఫోన్ లలో ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది? అని సెర్చ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇండియన్ మార్కెట్ లో కొత్తగా విడుదలైన ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా ఈ రెండు ఫోన్లు కూడా పెద్ద బ్యాటరీ, 5G కనెక్టివిటీ మరియు రోజువారీ పనులకు సరిపడే పెర్ఫార్మెన్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే, డిస్‌ప్లే, కెమెరా, ఛార్జింగ్, సాఫ్ట్‌వేర్ వంటి కొన్ని అంశాల్లో కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలు ఉన్న ఈ ఫోన్ లలో ఏ 5G ఫోన్ కొనాలి అని చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

డిస్‌ప్లే

వివో T5 లైట్ ఫోన్ లో 6.74 అంగుళాల LCD డిస్‌ప్లే ఉండగా, ఒప్పో K14x ఫోన్ లో 6.75 అంగుళాల LCD ప్యానెల్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లూ కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో వస్తాయి. ఈ స్క్రీన్ సెటప్ తో ఈ రెండు ఫోన్లు కూడా రోజువారీ వినియోగానికి సరిపోతాయి. ఈ స్క్రీన్ లతో ఈ రెండు ఫోన్లలో స్క్రోలింగ్, సోషల్ మీడియా మరియు వీడియో స్ట్రీమింగ్ అనుభవం చాలా సాఫీగా ఉంటుంది. స్క్రీన్ పరంగా ఈ రెండు ఫోన్లు కూడా దాదాపుగా సమానమైన అనుభవాన్ని అందిస్తాయి.

పెర్ఫార్మన్స్

వివో T5 లైట్ మరియు ఒప్పో K14x రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా మీడియాటెక్ Dimensity 6300 చిప్‌ సెట్ కలిగి ఉంటాయి. కాబట్టి, ఈ రెండు ఫోన్స్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో తగిన పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తాయి. గేమింగ్, మల్టీ టాస్కింగ్, 5G పనితీరులో రెండు ఫోన్లు గొప్పగా ఉంటాయి. అయితే, ఒప్పో K14x తన సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌ తో కొంత స్మూత్ అనుభవాన్ని అందించే అవకాశం ఉంది.

Vivo T5 Lite vs OPPO K14x

కెమెరా

వివో T5 లైట్ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే, ఒప్పో K14x లో కూడా 50MP ప్రధాన కెమెరాతో పాటు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. వెలుగు బాగున్నప్పుడు ఈ రెండు ఫోన్లు కూడా మంచి ఫోటోలు తీస్తాయి. అయితే, పోర్ట్రెయిట్ ఫోటోలు, AI కెమెరా ఫీచర్లలో ఒప్పో ఫోన్ కొంత మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

బ్యాటరీ అండ్ ఛార్జింగ్

బ్యాటరీ విభాగంలో ఈ వివో మరియు ఒప్పో రెండు ఫోన్లు కూడా 6,500mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు రోజంతా కాకుండా రెండు రోజుల వరకు సాధారణ వినియోగాన్ని అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. వాస్తవ వినియోగంలో ఈ రెండు ఫోన్ల మధ్య బ్యాటరీ అండ్ ఛార్జ్ ఫీచర్స్ లో తేడా చాలా తక్కువగా ఉంటుంది.

Also Read : Amazon Great Freedom Sale ఫస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ రివీల్ చేసింది.!

డిజైన్ అండ్ బిల్డ్

ఈ విభాగంలో వివో ఫోన్ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, వివో ఫోన్ IP65 రేటింగ్‌ తో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ తో మంచి డ్యూరబుల్ ఫోన్ గా వస్తుంది. దీంతో రోజువారీ వినియోగంలో ఈ ఫోన్ మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఒప్పో ఫోన్ కూడా మంచి బిల్డ్ క్వాలిటీని అందించినప్పటికీ, డ్యూరబిలిటీ విషయంలో వివో ఫోన్ కొంత ముందంజలో ఉంటుంది.

ఏది బెటర్ ఆప్షన్ ?

ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షన్ ? అని చుస్తే, మీకు బలమైన బిల్డ్, ఎక్కువ కాలం నడిచే బ్యాటరీ బ్యాకప్, మన్నికైన ఫోన్ కావాలంటే వివో T5 లైట్ ఫోన్ మీకు మంచి ఎంపిక గా నిలుస్తుంది. అయితే, మంచి కెమెరా అనుభవం, సాఫ్ట్‌ వేర్ ఆప్టిమైజేషన్, కొద్దిగా వేగవంతమైన ఛార్జింగ్ ఫోన్ కోరుకుంటే మాత్రం ఒప్పో K14x ఫోన్ ను చూడొచ్చు. అయితే, ప్రైస్ మీ మొదటి ఆప్షన్ అయితే ఒప్పో ఫోన్ మీకు చవక ధరలో లభించే ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile