Jio 5G: తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ప్రాంతాలలో 5G లాంచ్ చేసిన జియో.!
తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ప్రాంతాలలో 5G లాంచ్ చేసిన జియో
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని 6 నగరాల్లో 5G సేవలను లాంచ్ చేసింది
తెలంగాణ లోని 3 నగరాలలో లేటెస్ట్ గా తన 5G సేవలను లాంచ్ చేసింది
Jio 5G: తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ప్రాంతాలలో 5G లాంచ్ చేసిన జియో. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలోని చాలా నగరాలలో Jio True 5G సర్వీస్ లను లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని 6 నగరాల్లో మరియు తెలంగాణ లోని 3 నగరాలలో లేటెస్ట్ గా తన 5G సేవలను లాంచ్ చేసింది. లేటెస్ట్ గా తెలుగు రాష్టాలలోని ఏ నగరాల్లో జియో తన 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసిందో వివరంగా చూద్దాం.
Surveyఈరోజు రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంధ్యాల మరియు తెనాలి నగరాలలో తన 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం లోని ప్రధాన పట్టణాలైన ఆదిలాబాద్, మహబూబ్ నగర్ మరియు రామగుండం లలో Jio True 5G సర్వీస్ లను అందించింది. కొత్తగా 5G లాంచ్ చేసిన నగరాలతో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాలలోని 31 పట్టణాలలో జియో 5G నెట్ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు Jio True 5G అందుబాటులోకి వచ్చిన నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చని కూడా జియో వెల్లడించింది.
మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile