మీ ఏరియాలో Network Speed తగినంత లేదని మీకు డౌట్ ఉంటే ఇలా చెక్ చేయండి.!

HIGHLIGHTS

నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది

అన్ని పనులకు మంచి వేగవంతమైన నెట్‌వర్క్ స్పీడ్‌ అవసరం అవుతుంది

Network Speed చెక్ చేయడానికి అనేక సాధనాలు మరియు పద్ధతులు ఆన్‌లైన్ లో మీకు అందుబాటులో ఉన్నాయి

మీ ఏరియాలో Network Speed తగినంత లేదని మీకు డౌట్ ఉంటే ఇలా చెక్ చేయండి.!

నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది మరియు చాలా ముఖ్యమైంది. స్టూడెంట్స్ కోసం ఆన్‌లైన్ క్లాసులు, గేమర్స్ ఇష్టమైన ఆన్‌లైన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ మొదలుకొని ఇంటి వద్ద నుంచే పనులు చక్కబెట్టే వర్క్ ఫ్రమ్ వంటి అన్ని పనులకు మంచి వేగవంతమైన నెట్‌వర్క్ స్పీడ్‌ అవసరం అవుతుంది. అయితే, ఒక్కొక్కసారి లేదా చాలా సందర్భాల్లో అసలు మా ఏరియాలో నెట్‌వర్క్ స్పీడ్‌ ఉందో లేదో తెలుగు అని అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. దీనికోసం ఎక్కువ శ్రమ పడకుండా మీరు ఆన్‌లైన్ లో సులభంగా ఎలా చెక్ చేయాలో ఈ రోజు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Network Speed Check

నెట్‌వర్క్ స్పీడ్‌ చెక్ చేయడానికి అనేక సాధనాలు మరియు పద్ధతులు ఆన్లైన్ లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతులు మరియు సాధనాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం.

స్పీడ్ టెస్ట్ యాప్స్

మీ ఏరియాలో లేదా మీ ఇంట్లో నెట్‌వర్క్ స్పీడ్ తెలుసుకోవడానికి అత్యంత సులభమైన మార్గం స్పీడ్ టెస్ట్ యాప్స్ వాడకం. దీనికోసం స్పీడ్ టెస్ట్ బై Ookla మరియు ఫాస్ట్.com మంచి సాధనాలు గా ఉంటాయి. అంతేకాదు, ఇవి ఉపయోగించడం కూడా చాలా సులభం.

ఎలా చెక్ చేయాలి?

ముందు మీ ఫోన్ లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్ ను మీ ఫోన్ లో ఓపెన్ చేసి Go లేదా Start బటన్ నొక్కండి. అంతే, జస్ట్ సెకండ్స్ లో మీ నెట్ వర్క్ స్పీడ్ రిపోర్ట్ మీ కళ్ళ ముందు ఉంటుంది. ఇందులో డౌన్ లోడ్ స్పీడ్, అప్ లోడ్ స్పీడ్ మరియు Ping (జాప్యం) వంటి పూర్తి వివరాలు ఉంటాయి. దీని ద్వారా మీ నెట్ వర్క్ స్పీడ్ మీకు తెలుస్తుంది.

యాప్ అవసరం లేకుండా టెస్ట్

ఒకవేళ మీరు యాప్ అవసరం లేకుండా మీ నెట్ వర్క్ స్పీడ్ టెస్ట్ చేయాలనుకుంటే కూడా మీకు అవకాశం ఉంది. దీనికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి “Internet Speed Test” అని సెర్చ్ చేయండి. ఆలా కాకుండా నేరుగా సెర్చ్ చేయాలనుకుంటే fast.com లేదా Speed by Ookla అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ సైట్స్ నుంచి మీకు వివరాలు ఈజీగా లభిస్తాయి.

Network Speed Check

మీ ఏరియాలో ఏ నెట్ వర్క్ బాగుందో తెలుసుకోండి

మీ లొకేషన్ లో ఏ నెట్ వర్క్ (BSNL, Jio, Airtel, Vi) బాగుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే, వేగవంతమైన నెట్వర్క్ ను ఎంచుకోవడానికి ఇది మంచి మార్గం అవుతుంది. దీనికోసం “Open Signal” మరియు “nPerf” యాప్స్ గొప్పగా సహాయం చేస్తాయి. ఈ యాప్స్ సిగ్నల్ స్ట్రెంగ్త్, మీ ఏరియాలో ఉన్న యావరేజ్ స్పీడ్ మరియు కవరేజ్ మ్యాప్ వంటి వివరాలు చూపిస్తుంది.

Also Read: Telegram Down: టెలిగ్రామ్ డౌన్ సమస్యతో మెసేజ్ సర్వీస్ లో అంతరాయం.!

స్పీడ్ చెక్ లో ఇవి గుర్తుంచుకోండి

Wi-Fi మరియు మొబైల్ డేటా ఫలితాలు వేరుగా ఉంటాయి. అలాగే, ఇంటి లోపల (Indoor) మరియు వెలుపల (outdoor) లో స్పీడ్ మారుతుంది. అంతేకాదు, పీక్ టైమ్ లో కూడా స్పీడ్ మారుతుంది. అంటే, సమయాన్ని బట్టి కూడా నెట్ వర్క్ స్పీడ్ మారుతుంది. అందుకే, 3 లేదా అంతకంటే ఎక్కువ సమయం స్పీడ్ చెక్ చేయడం మంచిది.

స్పీడ్ టెస్ట్ అనేది మీ దగ్గరలో ఉన్న సర్వర్ తో కనెక్ట్ అయ్యి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ను లెక్కిస్తాయి. అందుకే, మీ లొకేషన్ పై ఆధారపడి రిజల్ట్ మారుతుంది.

మినిమం స్పీడ్ ఎంత ఉండాలి?

సాధారణ బ్రౌజింగ్ కోసం 5–10 Mbps వేగం సరిపోతుంది. HD స్ట్రీమింగ్ కోసం 20–50 Mbps మరియు గేమింగ్ మరియు హెవీ యూసేజ్ కోసం 100+ Mbps స్పీడ్ అవసరం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo