Vivo V70 FE లాంచ్ కంటే ముందే ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ లీకయ్యాయి.!

HIGHLIGHTS

Vivo V70 FE లాంచ్ కంటే ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ లీకయ్యాయి

మరో రెండు రోజుల్లో వివో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి 70 FE

స్పెక్స్ అండ్ ఫీచర్స్ లీక్ కావడంతో ఈ ఫోన్ గురించి ఒక అవగాహన ఇచ్చినట్లయింది

Vivo V70 FE లాంచ్ కంటే ముందే ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ లీకయ్యాయి.!

Vivo V70 FE లాంచ్ కంటే ముందే ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ లీకయ్యాయి. మరో రెండు రోజుల్లో వివో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి 70 FE లాంచ్ కంటే ముందే పూర్తి వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ లీక్ కావడంతో ఈ ఫోన్ గురించి ఒక అవగాహన ఇచ్చినట్లయింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V70 FE : లీక్డ్ ప్రైస్ ఏమిటి?

వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను వివో మూడు వేరియంట్స్ లాంచ్ చేస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఇందులో 8 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 37,999 ధరతో, 8 జీబీ + 256 జీబీ మిడ్ వేరియంట్ ను రూ. 40,999 ధరతో మరియు 12 జీబీ + 128 జీబీ హైఎండ్ వేరియంట్ ను రూ. 44,999 ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ ఛే చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ తో గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Vivo V70 FE : ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను 6.83 ఇంచ్ 1.5K రిజల్యూషన్ OLED ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ప్రీమియం డీటెయిల్స్ తో పాటు 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Vivo V70 FE price leaked

ఈ ఫోన్ లేటెస్ట్ Origin OS జతగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో జబర్దస్త్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఇది 1.5 మీటర్ల లోతులో రెండు గంటల వరకు వాటర్ ను నిలువరించే శక్తి ఉంటుందని వివో పేర్కొంది.

ఈ వివో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. అయితే, ఇందులో CIPA 4.0 OIS సూపర్ అల్ట్రా స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 200MP ప్రధాన కెమెరా ఉంటుంది మరియు దానికి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరాని అందించింది. ఇవి కాకుండా ఫోన్ ముందు భాగంలో 50MP AF గ్రూప్ సెల్ఫీ కెమెరాని జతగా అందించింది. 30x జూమ్, సూపర్ మోషన్ స్నాప్ షాట్, AI వెథర్ చేంజ్ మరియు మరిన్ని అడ్వాన్స్డ్ AI కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయని వివో ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.

Also Read: మీ ఏరియాలో Network Speed తగినంత లేదని మీకు డౌట్ ఉంటే ఇలా చెక్ చేయండి.!

బ్యాటరీ విభాగంలో కూడా ఈ వివో స్మార్ట్ ఫోన్ గొప్ప సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఈ బ్యాటరీని అతి వేగంగా ఛాఫ్ర్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ ల అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo