Telecom: 28 మరియు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ పై కేంద్రం నిర్ణయం అసలు నిజం ఇదే.!

HIGHLIGHTS

ఇప్పుడు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం ఎక్కువగా ప్రబలుతోంది

ప్రభుత్వం 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు చేసి 30 రోజుల ప్లాన్ తప్పనిసరి చేసింది అనే వార్త వైరల్ అవుతున్నాయి

28 రోజుల రీఛార్జ్ ప్లాన్ పై కేంద్రం నిర్ణయం అసలు నిజం తెలుసుకోండి

Telecom: 28 మరియు 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ పై కేంద్రం నిర్ణయం అసలు నిజం ఇదే.!

Telecom: ఇప్పుడు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం ఎక్కువగా ప్రబలుతోంది. ఇది మనకు సుపరిచితమైన విషయమే అయినా కొత్త అసత్య ప్రచారం గురించి తెలుసుకోవడం అందరికీ మంచిది. గత నాలుగు ఐదు రోజుల నుంచి “ప్రభుత్వం 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు చేసి 30 రోజుల ప్లాన్ తప్పనిసరి చేసింది” అనే వార్త అతిగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? అని తెలుసుకోండి. ఎందుకంటే, ఇది పూర్తిగా నిజం కాదు. 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ పై కేంద్రం నిర్ణయం అసలు నిజం తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Telecom: కొత్త రూల్స్ న్యూస్ ఏమిటి?

భారత టెలికాం రంగాన్ని నియంత్రించే సంస్థ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలోనే 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ గురించి దిశా నిర్ధేశం అందించింది. 2022 లో జరిగిన సమావేశం నుంచి ప్రతీ టెలికాం కంపెనీ కూడా 28 రోజుల ప్లాన్ తో పాటు కనీసం ఒక్కటైనా 30 రోజుల వ్యాలిడిటీ మరియు క్యాలెండర్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్ తన యూజర్ల కోసం అందించాలని ఆదేశించింది.

అంటే, టెలికాం కంపెనీలు అందించే 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటు 30 మరియు నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా అందించాలి. అయితే, ఎక్కడా కూడా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ లను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. అయితే, 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ తో పాటు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా యూజర్ కోసం ఎక్కువగా ఆఫర్ చేయాలనీ మాత్రమే ఆదేశించింది. తద్వారా యూజర్ కు అనువైన మరియు అనుకూలమైన ప్లాన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్ తెలిపింది.

అయితే, సోషల్ మీడియాలో అసలు విషయాన్ని చెప్పకుండా “ప్రభుత్వం 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు చేసి 30 రోజుల ప్లాన్ తప్పనిసరి చేసింది” అని అసత్య ప్రచారం చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చిన “28 రోజుల ప్లాన్ రద్దు” వార్తలు నమ్మొదు.

Also Read: Vivo V70 FE లాంచ్ కంటే ముందే ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ లీకయ్యాయి.!

30 రోజుల ప్లాన్ మళ్ళీ తెర పైకి ఎందుకు వచ్చింది?

పార్లమెంటు సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) MP రాఘవ్ చెడ్డా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ వలన ప్రజలకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వానికి వినతి చేశారు. అంతేకాదు, వాటి స్థానంలో కొత్త 30 రోజులు మరియు నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకురావాలని వినతి కూడా చేశారు.

Telecom New rules 2026

ఈ వినతి పై దృష్టి సారించిన ప్రభుత్వం కొత్త దిశ నిర్దేశాలు అందించింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు కూడా 28 రోజులకు దీటుగా 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా తన యూజర్ల కోసం అందించాల్సి ఉంటుంది.

అంటే, కొత్త ఆదేశాల ప్రకారం 28 రోజుల ప్లాన్లు కొనసాగుతూనే ఉంటాయి మరియు అదే సమయంలో 30 రోజుల ప్లాన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త చర్య వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo