VIVO S2 : 6 సంవత్సరాల తర్వాత S1 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ప్రకటించిన వివో.!
VIVO S2 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు వివో ప్రకటించింది
6 సంవత్సరాలుగా మర్చిపోయిన S సిరీస్ నుంచి ఈ కొత్త ఫోన్ విడుదల చేస్తోంది
వివో ఎస్ 2 కోసం అమెజాన్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది.
VIVO S2 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు వివో ప్రకటించింది. 2026 లో వరసపెట్టి కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన వివో ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా మర్చిపోయిన S సిరీస్ నుంచి ఈ కొత్త ఫోన్ విడుదల చేస్తోంది. 2020 ప్రారంభంలో చివరిగా Vivo S1 Pro లాంచ్ చేసిన కంపెనీ, ఇప్పుడు ఎస్ 2 సిరీస్ లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
SurveyVIVO S2 : లాంచ్ డేట్
వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ కోసం ‘కమింగ్ సూన్’ ట్యాగ్ తో టీజింగ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా టీజర్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చే ఫీచర్స్ మరియు కెమెరా మోడ్యూల్ డిజైన్ ను కూడా ఈ ఫోన్ టీజర్ ద్వారా రివీల్ చేసింది.
VIVO S2 : టీజర్ లో ఏమి తెలిపింది?
వివో ఎస్ 2 కోసం అమెజాన్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ టీజర్ పేజి ద్వారా ఈ ఫోన్ లో కలిగిన కొన్ని వివరాలు గురించి హింట్ ఇచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా మోడ్యూల్ ఇమేజ్ ను వివో రివీల్ చేసింది. ఈ టీజర్ ఇమేజ్ ప్రకారం, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఫోన్ పై భాగంలో అడ్డంగా ఉంది. ఇది చూడటానికి సరికొత్తగా మరియు ప్రీమియం లుక్ తో కనిపించేలా చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ వెనుక కర్వుడ్ బ్యాక్ డిజైన్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.

ఈ ఫోన్ లో ఉన్న కెమెరా స్టన్నింగ్ ఫోటోలు మరియు వీడియోలు అందించే శక్తి కలిగి ఉంటుందని కంపెనీ టీజర్ లో హింట్ ఇచ్చింది. ఇదే కాదు ఈ ఫోన్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్, ఫాస్ట్ ర్యామ్ మరియు హెవీ స్టోరేజ్ కలిగి ఉంటుందని కూడా వివో ఈ టీజర్ పేజీ లో వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఇమ్మర్సివ్ ఆడియో మరియు గొప్ప విజువల్స్ అనుభూతిని అందించే స్క్రీన్ మరియు సౌండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది.
Also Read : FB Instagram Down: మీ ఫోన్ లో ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ పనిచేయడం లేదా.!
అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్స్ గురించి కేవలం హింట్ మాత్రమే ఇచ్చింది, ఇంకా కంప్లీట్ గా వివరాలు అందించలేదు. ఈ ఫీచర్ లను త్వరలో వెల్లడిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile