Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ డేట్ వచ్చేసింది .. ఆఫర్స్ ఎలా ఉంటాయంటే.!

HIGHLIGHTS

2026 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తన అప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసింది

Flipkart Freedom Sale డీల్స్ గురించి కూడా ఫ్లిప్ కార్ట్ హింట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది

స్మార్ట్ ఫోన్ లను గొప్ప డీల్స్ ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ హింట్ ఇచ్చింది

Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ డేట్ వచ్చేసింది .. ఆఫర్స్ ఎలా ఉంటాయంటే.!

Flipkart Freedom Sale: 2026 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తన అప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసింది. అదే, ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ మరియు ఈ సేల్ భారీ ఆఫర్స్ అండ్ డీల్స్ తెస్తుంది. ఈ అప్ కమింగ్ సేల్ డేట్ తో పాటు డీల్స్ గురించి కూడా ఫ్లిప్ కార్ట్ హింట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన ఈ లేటెస్ట్ సేల్ నుంచి మనం యూజర్లు ఏమి ఆశించవచ్చు మరియు బెస్ట్ ఆఫర్లు ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Freedom Sale : ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్డ్ ఫ్రీడమ్ సేల్ తో పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలను తిప్పి కొట్టండి అని ఫ్లిప్ కార్డ్ తన మెయిన్ టీజర్ పేజీలో క్యాప్షన్ ని పెట్టింది. అంటే, ఈ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను సైతం గొప్ప డీల్స్ ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ హింట్ ఇచ్చింది.

Flipkart Freedom Sale

ఈ సేల్ ను SBI CARD భాగస్వామ్యంతో ప్రకటించింది. అందుకే, ఈ సేల్ నుంచి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.

Flipkart Freedom Sale : ఏ ఆఫర్లు ఆశించవచ్చు?

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ బిగ్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ లో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. స్మార్ట్ ఫోన్ ధరలు ఇటీవలి కాలంలో పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించే బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలోనే స్మార్ట్ ఫోన్ లను అందుకునే అవకాశం ఉంటుంది. అంటే, స్మార్ట్ ఫోన్ పై బ్స్ డీల్స్ ను ఈ సేల్ నుంచి మనం ఆశించవచ్చు.

Also Read: VIVO S2 : 6 సంవత్సరాల తర్వాత S1 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ప్రకటించిన వివో.!

ఇంకా ఏ ఆఫర్లు ఆశించవచ్చు?

ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీ మరియు సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ ఆశించవచ్చు. ఎందుకంటే, రీసెంట్ గా ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన సేల్ నుండి లేటెస్ట్ బ్రాండెడ్ సౌండ్ బార్ లను మరియు స్మార్ట్ టీవీ లను సైతం బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి కూడా సౌండ్ బార్ మరియు స్మార్ట్ టీవీ డీల్స్ మనం ఆశించవచ్చు.

హోమ్ అప్లయెన్సెస్

ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ను గృహోపకరణాలు కూడా అముఞ్చి డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ మరియు ఏసీలపై భారీ డీల్స్ ఆశించవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ స్టార్టింగ్ డేట్ కంటే ముందే కొన్ని ప్రత్యేమైన డీల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile