Jio Unlimited Plans: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు OTT యాక్సెస్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

OTT యాక్సెస్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోంది

Prime Video మరియు Zee5-SonyLIV కాంబో తో వచ్చిన కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

Jio బెస్ట్ అన్లిమిటెడ్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

Jio Unlimited Plans: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు OTT యాక్సెస్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్.!

Jio Unlimited Plans: అన్లిమిటెడ్ డేటా, కాలింగ్ మరియు OTT యాక్సెస్ తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోంది. అందులోనూ, Prime Video మరియు Zee5-SonyLIV కాంబో తో తీసుకు వచ్చిన కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ మరింత ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్స్ గా చెప్పబడుతున్నాయి. అందుకే, ఈరోజు రిలయన్స్ అందిస్తున్న ఈ బెస్ట్ అన్లిమిటెడ్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో రూ. 3,227 ప్లాన్

రిలియన్స్ జియో రూ. 3,227 ప్లాన్ పూర్తిగా 1 ఇయర్ అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. అంటే, 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా (4G డేటా 2GB/day) మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 1 ఇయర్ Prime Video సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ ప్లాన్ తో పూర్తిగా 1 ఇయర్ అన్లిమిటెడ్ లాభాలు మరియు OTT ప్రయోజనం పొందవచ్చు.

ఇక జియో అందిస్తున్న Zee5-SonyLIV కాంబో ప్లాన్స్ విషయానికి వస్తే, జియో ఈ కేటగిరిలో రూ. 909 మరియు రూ. 3,662 రెండు ప్లాన్ లను అందిస్తోంది. ఈ ప్లాన్స్ అందిస్తున్న పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

Also Read : Sony Smart Tv ల పైన 3 Years వారెంటీ మరియు భారీ డీల్స్ ప్రకటించిన Amazon.!

జియో రూ. 909 ప్లాన్

రిలయన్స్ జియో రూ. 909 ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా (4G డేటా 2GB/day) మరియు డైలీ 100SMS లిమిటెడ్ తో 84 రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV మరియు ZEE5 రెండు OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. మూడు నెలల అన్లిమిటెడ్ లాభాలను OTT సబ్ స్క్రిప్షన్ తో కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

జియో రూ. 3,662 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క రూ. 3,662 ప్లాన్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా (4G డేటా 2.5 GB/day) మరియు డైలీ 100SMS లిమిటెడ్ తో 365 రోజుల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV మరియు ZEE5 రెండు OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. పూర్తి సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలను OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైనది.

Also Read : Amazon పండుగ Sale నుండి Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo