దీపావళి 2023 పండుగ సెలబ్రేషన్స్ సందర్భంగా Jio Diwali Offer ను అనౌన్స్ చేసింది. యూజర్లకు అధిక లాభాలను ఉచితంగా ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది రిలయన్స్ జియో. యూజర్లకు దీపావళి కానుకగా తీసుకు వచ్చిన ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 23 రోజుల అధనపు వ్యాలిడిటీ మరియు 75GB ల హై స్పీడ్ డేటాని ఉచితం అందిస్తుంది. అంటే, ఈ దీపావళి పండుగకు డబుల్ ధమాకా ఈ ఆఫర్ ద్వారా జియో అందించింది. రిలయన్స్ జియో తీసుకు వచ్చిన ఈ కొత్త దీపావళి ఆఫర్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Jio Diwali Offer
2023 దీపావళి పండుగ కానుకగా రిలయన్స్ జియో బడ్జెట్ వన్ ఇయర్ లాంగ్ వ్యాలిడిటీ అయిన రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ పైన గొప్ప ప్రయోజనాలను జత చేసింది. రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ముందుగా వన్ ఇయర్ వ్యాలిడిటీ, డైలీ డేటా మరియు ఇతర ప్రయోజనాలతో వచ్చేది. అయితే, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పైన మరిన్ని అధనపు ప్రయోజనాలను కూడా యూజర్లు అందుకోవచ్చు.
రిలయన్స్ జియో రూ. 2,999 దీపావళి ఆఫర్ తో ఇప్పుడు 365 రోజుల వ్యాలిడిటీ + 23 రోజుల అధనపు వ్యాలిడిటీతో మొత్తంగా 388 రోజు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిటీకి కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పైన డైలీ 2.5 GB డేటా మరియు 5G నెట్ వర్క్ పైన Unlimited 5G హై స్పీడ్ డేటాని మరియు డైలీ 100 SMS ల వాడుక ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ తో అధనంగా జత చేసిన 23 రోజులు వ్యాలిడిటీని డైలీ ఉచిత డేటాని కూడా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అందుకోవచ్చు. జియో ఇప్పటికే మరిన్ని కొత్త వన్ ఇయర్ ప్లాన్ లను అందించినా ఈ ప్లాన్స్ పైన ఈ ఆఫర్లను జత చెయ్యలేదు. కేవలం రూ. 2,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ పైన మాత్రామే ఈ దీపావళి అఫర్ ను అందించింది.