జియో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: ఇక నుండి ఆ ప్లాన్స్ లో ఈ ప్రయోజనం ఉండదట.!
రిలయన్స్ జియో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ ఒకటి వెల్లడించింది
కస్టమర్లకు ప్రీతిపాత్రమైన రీఛార్జ్ ప్లాన్ లను తొలగించిన జియో
కొన్ని జనరంజక ప్రీపెయిడ్ ప్లాన్ లను పూర్తిగా నిలిపివేసింది
రిలయన్స్ జియో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ ఒకటి వెల్లడించింది. జియో కస్టమర్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రీఛార్జ్ ప్లాన్ లను పూర్తిగా తొలిగించడమే కాకుండా కొన్ని ప్లాన్ లతో అఫర్ చేస్తున్న Disney+ HotStar ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా తొలగించినట్లు ప్రస్తుత నివేదికలు చెబుతున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన జియో రీఛార్జ్ ప్లాన్‌లు చాలా వరకు jio అధికారిక వెబ్‌సైట్ మరియు యాప్ నుండి అదృశ్యమయ్యాయి. మరి కొత్త సంగతి గురించి విపులంగా తెలుసుకుందామా.
Surveyరిలయన్స్ జియో తన కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించే ప్లాన్ లను చాలానే అందించింది. అయితే, ప్రస్తుతం వీటిలో కొన్ని జనరంజక ప్రీపెయిడ్ ప్లాన్ లను పూర్తిగా నిలిపివేసింది. ఈరోజు మన రిలయన్స్ జియో నిలిపివేసిన అని ప్లాన్ వివరాలను విపులంగా తెలుసుకుందాం.
అంటే, ఇక నుండి మీరు Jio సైట్ ను సందర్శించి ఏ ప్లాన్ లను కొనుగోలు చేయ్యలేరు అనే విషయాన్ని ఇక్కడ మేము మీకు తెలియజేస్తాము. మొదటిగా, రిలయన్స్ జియో యొక్క బెస్ట్ యాడ్-ఆన్ ప్యాక్ ల లిస్ట్ లోకి వెళితే, రూ. 151 ప్లాన్‌ను జియో నిలిపివేసింది. దీనితో పాటుగా హెవీ యాడ్ ఆన్ ప్యాక్ లైన 555 మరియు 659 రూపాయల యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్ లను కూడా నిలిపివేసింది.
ఇక రెగ్యులర్ రీఛార్జ్ లైన రూ. 333 రీఛార్జ్ ప్లాన్, రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 583 ప్లాన్, రూ. 601 ప్లాన్, 783 మరియు రూ.799 ప్లాన్ వంటి ఇతర పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక Disney+ HotStar ఉచిత సబ్ స్క్రిప్షన్ ను నిలిపి వేసిన ప్లాన్లలో రూ.1066 ప్లాన్, రూ.2999 ప్లాన్ మరియు రూ.3119 ప్లాన్ లు ఉన్నాయి. అంటే, ఇకనుండి ఇక్కడ సూచించిన ఏ జియో ప్లాన్‌తో కూడా మీకు డిస్నీ + హాట్‌స్టార్ యాక్సెస్ ఇవ్వబడదు.
మరిన్ని జియో ప్లాన్ వివరాలు మరియు రీఛార్జ్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile