జియో జబర్దస్త్ అఫర్: రూ.899 కే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించింది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 28 Jan 2022
HIGHLIGHTS
  • రిలయన్స్ జియో బెస్ట్ దీర్ఘకాలిక ప్లాన్ తీసుకొచ్చింది

  • ఈ ప్లాన్ తో 336 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజానాలను అందుకోవచ్చు

  • జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది

జియో జబర్దస్త్ అఫర్: రూ.899 కే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించింది
జియో జబర్దస్త్ అఫర్: రూ.899 కే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించింది

రిలయన్స్ జియో కేవలం రూ.899 రూపాయలకు 336 రోజుల వ్యాలిడిటీ అందించే బెస్ట్ దీర్ఘకాలిక ప్లాన్ తీసుకొచ్చింది. అయితే, ఈ ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రం వర్తిస్తుంది. జియోఫోన్ కస్టమర్లు ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా తో సహా మరిన్ని ప్రయోజాలను తో 336 రోజుల పాటు అందుకుంటారు. ఈ ప్లాన్ ను JIO-ALL-IN-ONE కేటగిరిలో అందించింది. మీరు కనుక జియోఫోన్ యూజర్ అయితే, మీకు నెల నెల రీఛార్జ్ చేసే పనిలేకుండా ఈ ప్లాన్ తో 336 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజానాలను అందుకోవచ్చు.

జియో రూ.899 ప్లాన్ ప్రయోజనాలు

జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ రూ.899 ప్లాన్ ప్రయోజాల గురించి చూసినట్లయితే, ఈ ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల సమయాన్ని 28 రోజులకు కుదిస్తుంది, జియో రెగ్యులర్ ఒక నెల రీఛార్జ్ మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్లాన్ తో 28 రోజుల కు 2GB డేటా చొప్పున 12 నెలలకు 24 GB(2GB x 12నెలలు)  హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలలకు (28 డేస్ x 12 సైకిల్స్)  ఉచిత SMS సౌకర్యాన్ని మరియు అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా ఇస్తుంది.

ఇక జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి చూస్తే Jio Rs.2,999 Plan ను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Jio announce best long validity plan for jiophone users
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status