దేశంలో అత్యంత చవకైన లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

దేశంలో అత్యంత చవకైన లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్

కేవలం రూ.225 రూపాయలకే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ

ఉచిత కాలింగ్ మినిట్స్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు

దేశంలో అత్యంత చవకైన లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి మీకు తెలుసా.!

దేశంలో అత్యంత చవకైన లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. కేవలం రూ.225 రూపాయలకే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అందించే ప్లాన్ ఒకటి వుంది. ఈ ప్లాన్ తో లైఫ్ వ్యాలిడిటీని మరియు ఉచిత కాలింగ్ మినిట్స్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ బెస్ట్ ప్లాన్ ను ప్రభుత్వ టెలికం సంస్థ మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ (MTNL) అఫర్ చేస్తోంది. అదే, MTNL  అందిస్తున్న రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MTNL Rs.225 (JS) Plan:

ఈ ప్లాన్ కోసం మీరు కేవలం రూ.225 రూపాయలు చెల్లించి ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్లాన్ రీఛార్జ్ తో లైఫ్ టైం వ్యాలిడిటీ అందుతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు రీఛార్జ్ తో మీకు 100 నిముషాల ఉచిత కాలింగ్ మినిట్స్ కూడా అందుతాయి. అంటే, కేవలం 225 రూపాయల ఖర్చుతోనే జీవితకాలం వ్యాలిడిటీతో పాటుగా 100 నిముషాల కాలింగ్ మినిట్స్ కూడా మీరు పొందుతారు.

ఒక కాలింగ్ రేట్ మరియు ఇతర వివరాల్లోకి వెళితే, హోమ్ నెట్వర్క్ పైన లోకల్ మరియు STD కాలింగ్ కోసం నిముషానికి రూ.0.20 (20పైసలు) ఛార్జ్ చేయబడుతుంది. ఇక వీడియో కాలింగ్ కోసం నిముషానికి రూ.0.60 మరియు ఇతర నెటవర్క్ కోసం రూ.0.60 ఛార్జ్ చేయబడుతుంది. ఇక SMS ఛార్జ్ విషయానికి వస్తే, లోకల్ SMS కోసం Rs.0.50/SMS, నేషనల్ SMS కోసం Rs.0.50/SMS మరియు ఇంటర్నేషనల్ SMS కోసం రూ.4 నుండి రూ.5 వరకు చెల్లించాలి. చివరిగా డేటా విషయానికి వస్తే, 1MB డేటా వినియోగానికి 3పైసలు చెల్లించాలి.

గమనిక: MTNL నెట్ వర్క్ కేవలం ఢిల్లీ మరియు ముంబై నగరాలకు మాత్రమే వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo