BSNL Top Plan which offers unlimited benefits for one year
BSNL Top Plan: బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చాలా కాలంగా ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఎన్నో అందించింది. ముఖ్యంగా, కొన్ని వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా నిరంతర సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు అధిక డేటా వంటి అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌ను అందిస్తాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ అండ్ బెస్ట్ అన్లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ అందించిన రూ. 2,799 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఏడాది పొడవునా అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ వార్షిక రీచార్జ్ ఆప్షన్ లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్లాన్ కోసం చేసే ఖర్చు 12 నెలలకు విభజించి చూస్తే, మీకు నెలకు సుమారు రూ. 233 మాత్రమే అవుతుంది. అంటే ఈ ప్లాన్, తక్కువ నెలవారీ వ్యయంతో అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర ఆకర్షణీయమైన ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా మీకు లభిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,799 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను వినియోగదారులు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. అదనంగా, ప్రతిరోజూ 3 జీబీ వేగవంతమైన హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
అంతేకాదు, ఈ రోజువారీ డేటా పరిమితి పూర్తైన తర్వాత కూడా 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా వినియోగించే అవకాశం కూడా అందిస్తుంది. అలాగే, ప్రతి రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్ వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ లో భాగంగా మీకు లభిస్తుంది. ఈ ఫీచర్లతో దీర్ఘకాలిక వ్యాలిడిటీతో కూడిన సమగ్ర ప్రీపెయిడ్ ప్లాన్ గా ఇది వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది.
Also Read: కేవలం 5 వేల బడ్జెట్ ప్రైస్ లో 350W 5.1 Soundbar అందుకోండి.!
అయితే, ఇదే లాభాలు కొంచెం తక్కువ డైలీ డేటాతో అందించే మరో బేస్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ కూడా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS మరియు డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 365 రోజులు చెల్లుబాటు అవుతుంది.