కేవలం 19 రూపాయలకే 90 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఒకటి ఉందని మీకు తెలుసా.!

HIGHLIGHTS

19 రూపాయలకే 90 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్

తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ

ఈ ప్లాన్ కాలింగ్ ప్రయోజనాన్ని అందించడం గమనార్హం

కేవలం 19 రూపాయలకే 90 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఒకటి ఉందని మీకు తెలుసా.!

కేవలం 19 రూపాయలకే 90 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఒకటి ఉందని మీకు మీకు తెలుసా?  బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరంగా చుడనున్నాము. తన వినియోగదారులకు ఇంత తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ ప్రభుత్వ టెలికం కంపెనీ అయిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రమే. ఈ ప్లాన్ కేవలం రూ.19 రూపాయలకే 90 రోజుల వ్యాలిడిటీని మరియు కాలింగ్ ప్రయోజనాన్ని అందించడం గమనార్హం. కాకపోతే ఈ ప్లాన్ దేశం అంతటా  అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించే విషయం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మనం మాట్లాడుతున్న ఈ 19 రూపాయల BSNL ప్లాన్ కేవలం ఒక్క సర్కిల్ లో మాత్రమే ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంది. దేశంలో అత్యంత చవకైన ఈ ప్లాన్ ఏ సర్కిల్ మరియు రాష్ట్రాలలో చెలామణి అవుతోంది, ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

BSNL రూ.19 ప్లాన్:

BSNL రూ.19 ప్లాన్ పూర్తిగా 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 20 నిముషాల వాయిస్ కాలింగ్ మినిట్స్ కూడా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అఫర్ చేస్తోంది. అయితే, ఈ వాయిస్ కాలింగ్ మినిట్స్ ను 30 రోజుల వ్యవధిలోనే ఉపయోగించుకోవలసి ఉంటుంది. BSNL ఈ ప్లాన్ ను వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ వోచర్ గా అందిస్తోంది. ఈ ప్లాన్ తో నిముషానికి కాల్ ఛార్జ్ లెక్కించ బడుతుంది.

ఇక ప్లాన్ చెల్లుబాటు అయ్యే సర్కిల్స్ విషయానికి వస్తే, BSNL యొక్క ఈ రూ.19 ప్లాన్ నార్త్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో అందుబాటులో ఉంచింది. అంటే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం , మేఘాలయా,  నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలలో ఈ అత్యంత చవకైన ప్లాన్ అందుబాటులో వుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo