BSNL Super Plans: చవక ధరలో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
యూజర్లకు ఎటువంటి భారం లేకుండా చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్
బీఎస్ఎన్ఎల్ అందించిన మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో మీకు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి
అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలు అందుకోవచ్చు
BSNL Super Plans: అన్లిమిటెడ్ డేట్ మరియు కాలింగ్ తో వచ్చే బెస్ట్ ప్లాన్ తో ఒక మొబైల్ నెంబర్ మైంటైన్ చేయాలంటే ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం తన యూజర్లకు ఎటువంటి భారం లేకుండా చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ అందించింది. అందులోనూ, వన్ మంత్ ప్లాన్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి తగిన లాభాలతో ఈ ప్లాన్స్ అందించింది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న సూపర్ వన్ మంత్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.
SurveyBSNL Super Plans: బెస్ట్ వన్ మంత్ ప్లాన్స్
బీఎస్ఎన్ఎల్ అందించిన మూడు ప్లాన్స్ చాలా చవక ధరలో మీకు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. వీటిలో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 225 ప్లాన్ మరియు రూ. 251 రూపాయల మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాన్స్ కూడా మీకు నెల రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈ మూడు ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ రూ. 199 రూపాయల ప్లాన్
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS అందిస్తుంది. ఈ ప్లాన్ చవక ధరలో వచ్చే బెస్ట్ ప్లాన్ అవుతుంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 225 రూపాయల ప్లాన్
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 30 రోజులు చెల్లుబాటు తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మీకు 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ డేటా మరియు డైలీ 100SMS లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ 30 డేస్ ప్లాన్ గా నిలుస్తుంది.
Also Read: Nothing Phone (3): 80 వేల రూపాయల ఫోన్ పై 60 వేల రూపాయల డిస్కౌంట్ అందుకోండి.!
బీఎస్ఎన్ఎల్ రూ. 251 రూపాయల ప్లాన్
ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రీసెంట్ గా అనౌన్స్ చేయబడింది. ఇది స్టూడెంట్స్ కోసం అధిక డేటాతో అందించబడిన ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు మరియు అధిక డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు మీకు అందుతాయి. ఇది కాకుండా ఈ ప్లాన్ తో 100GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు డైలీ 100 SMS లాభాలు కూడా అందిస్తుంది.
ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మీకు బడ్జెట్ ధరలో లభిస్తాయి మరియు మంచి బెనిఫిట్స్ కూడా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అందిస్తాయి.