BSNL Plans: మీ బడ్జెట్ లో ఒక బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా.. జస్ట్ లుక్.!
బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది
బడ్జెట్ యూజర్ ను రంజింప చేసే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి
రూ. 200 రూపాయలు లేదా అంతకన్నా తక్కువలో కూడా మీకు గొప్ప ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి
BSNL Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన యూజర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. అందులో బడ్జెట్ యూజర్ ను రంజింప చేసే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ కేవలం రూ. 200 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ అయినా కూడా మీకు గొప్ప ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అటువంటి బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyBSNL Plans : ఏమిటి ప్లాన్స్?
బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ యూజర్ ను దృష్టిలో వుంచుకొని రూ. 200 రూపాయల కంటే తక్కువ ధరలో మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. ఈ ప్రైస్ రేంజ్ లో రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్లకు ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా ఉంటాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ రూ. 153 ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇండస్ట్రీ మొత్తం మీద బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 25 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1 జీబీ హై స్పీడ్ డేట్ (40Kbps వద్ద అన్లిమిటెడ్) మరియు ప్రతిరోజూ 100 SMS వంటి కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్
ఇది 28 రోజు అన్లిమిటెడ్ లాభాలు అందించే సూపర్ బడ్జెట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2 జీబీ 4జి స్పీడ్ డేటా (40Kbps వద్ద అన్లిమిటెడ్) మరియు డైలీ 100 SMS వినియోగ బెనిఫిట్స్ అందిస్తుంది.

ఒకవేళ మీరు 200 రూపాయల కంటే కొంచెం ఎక్కువ ఖర్చులో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు కోరుకుంటే రూ. 225 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను చూడవచ్చు.
Also Read: iQOO Neo 10R 5G ఫోన్ పై అమెజాన్ బ్లాక్ ఫ్రైడే బిగ్ డీల్ అందుకోండి.!
బీఎస్ఎన్ఎల్ రూ. 225 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ యొక్క యొక్క రూ. 225 ప్లాన్ 30 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్. డైలీ 100 SMS మరియు డైలీ 2.5 జీబీ హై స్పీడ్ డేటా (40Kbps వద్ద అన్లిమిటెడ్) అందిస్తుంది .
ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా యూజర్ లకు 200 రూపాయల ధరలో బెస్ట్ వాల్యూ అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా ఉంటాయి.