BSNL ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ మళ్ళీ తిరిగొచ్చింది.!
BSNL ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరోసారి తిరిగొచ్చింది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
ఈసారి నంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది
BSNL ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరోసారి తిరిగొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో నంబర్ నెల 15వ తేదీ నుంచి తొలగించబడింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను బీఎస్ఎన్ఎల్ ఈరోజు నుంచి మళ్ళి అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
Surveyఏమిటి ఈ BSNL ఒక్క రూపాయి ఆఫర్?
2025 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్ ను ఫ్రీడమ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ ప్లాన్ ను రెగ్యులర్ గా డేట్ అప్డేట్ చేస్తూ నవంబర్ 15వ తేదీ వరకు పెంచుతూ వచ్చింది. అయితే, నవంబర్ 15 నుంచి ఈ ఆఫర్ ప్లాన్ ని నిలిపివేసింది.
అయితే, ఈ ప్లాన్ కొత్త యూజర్ల పెరుగుదలకు మంచి అవకాశం కావడంతో బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ప్లాన్ ను ఈరోజు నుంచి మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభం నుంచి ఈ ప్లాన్ అనేక పేర్లతో అందుబాటులోకి వచ్చినా కూడా ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్ గా ప్రజల మనస్సులో నిలబడిపోయింది. ఈ ఆఫర్ ఈసారి నంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
BSNL ఒక్క రూపాయి ఆఫర్ బెనిఫిట్స్ ఏమిటి?
BSNL ఒక్క రూపాయి ఆఫర్ తో 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. ఇది కొత్త కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ అందించిన ప్రత్యేకమైన అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్. బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకునే యూజర్లు 1 రూపాయి చెల్లించి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు ను ఉచితంగా అందిస్తుంది. అంటే, మీరు మీ ఆధార్ నెంబర్ తో బీఎస్ఎన్ఎల్ సెంటర్ వద్దకు వెళ్ళి జస్ట్ ఒక్క రూపాయి చెల్లించి కొత్త సిమ్ కార్డ్ మరియు 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే ఈ ప్లాన్ తో రీఛార్జ్ కూడా చేయవచ్చు.

ఇక ఈ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను దేశం మొత్తం అన్ని నెట్ వర్క్ లకు కూడా అన్లిమిటెడ్ కాలింగ్ అవకాశం ఇస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ తోరీఛార్జ్ చెస్ యూజర్లకు డైలీ 2 జీబీ హైస్పీడ్ డేటా మరియు డైలీ 100SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ 2 జీబీ హైస్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: WhatsApp మరియు ఇతర మెసేజింగ్ యాప్స్ పై కొత్త ఆంక్షలు.. ఇక ఈ యాప్స్ వాడటం కష్టమే.!
టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద అతి చవక ధరలో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ఏకైక ప్రీపెయిడ్ ప్లాన్ గా ఇది నిలుస్తుంది.