WhatsApp మరియు ఇతర మెసేజింగ్ యాప్స్ పై కొత్త ఆంక్షలు.. ఇక ఈ యాప్స్ వాడటం కష్టమే.!
WhatsApp మరియు ఇతర మెసేజింగ్ యాప్స్ పై ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఆంక్షలు విధించింది
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది
మెసేజింగ్ యాప్స్ ను SIM కార్డు లేకుండా ఉపయోగించే అవకాశం ఉండదు
WhatsApp మరియు ఇతర మెసేజింగ్ యాప్స్ పై ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఆంక్షలు విధించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ట్రాక్ చేయడానికి వీలు లేని విధంగా ఉండే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ పై కఠినమైన నియమాలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలతో వాట్సాప్ వంటి మరిన్ని మెసేజింగ్ యాప్స్ ను SIM కార్డు లేకుండా ఉపయోగించే అవకాశం ఉండదు.
SurveyWhatsApp వంటి మెసేజింగ్ పై కొత్త ఆంక్షలు ఏమిటి?
ప్రభుత్వ కొత్త ఆంక్షలు మెసేజింగ్ యాప్స్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసే కొత్త నియమాల ద్వారా WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat వంటి మెసేజింగ్ లేదా కమ్యూనికేషన్ ప్లాట్ ఫారమ్ లను టెలీకమ్యూనికేషన్ ఐడెంటిఫయర్ యూజర్ ఎంటైటిస్ (TIUEs) గా గుర్తిస్తుంది. ఈ ఆంక్షలు విధించడానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటి వరకు వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ ఉపయోగించాలంటే సిమ్ కార్డ్ తీసేసిన తర్వాత లేదా ఇంటర్నెట్ బెస్ట్ మొబైల్ నెంబర్ తో కూడా వాట్సాప్ ఉపయోగించే అవకాశం వుంది. అయితే, ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకవు. మీరు ఏ ఫోన్ లో అయితే వాట్సాప్ వాడతారో ఆ ఫోన్ లో అదే నెంబర్ సిమ్ కార్డు తో కచ్చితంగా ఉండాలి. లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ మరిన్ని మెసేజింగ్ యాప్స్ ఉపయోగించలేరు.
ఎందుకు ఈ కొత్త ఆంక్షలు విధించింది?
యూజర్ మరియు దేశ భద్రతా కోసం ఈ కొత్త నియమాలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ కొత్త సిమ్ బైండింగ్ రూల్ తో యూజర్ మాత్రమే వారి మెసేజింగ్ యాప్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఫోనా స్పూఫింగ్, అక్రమ SIM లు, ఫేక్ నంబర్ వాడి చేసే మోసాలు, మెసేజింగ్ చాట్ స్కామ్ లు చేయడం వంటి అనేక సైబర్ నేరాలు నిరోధించడానికి గొప్ప అవకాశం ఉంటుంది.

యాప్ కాకుండా వెబ్ మరియు డెస్క్టాప్ వెర్షన్ కోసం కూడా కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేమిటంటే, ప్రతి 6 గంటలకు లాగ్ అవుట్ చేయాలి లేదా అవుతుంది. తర్వాత మళ్ళి తిరిగి QR-కోడ్ ద్వారా లాగిన్ చేసుకోవాలి. ఈ కొత్త రూల్ వల్ల Web-based అన్ కంట్రోల్ యాక్సెస్ వల్ల వచ్చే రిస్క్ ను తగ్గించవచ్చు.
Also Read: Vivo X300 Series లాంచ్ కంటే ముందే టాప్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ కొత్త రూల్స్ ద్వారా వెబ్ లేదా డెస్క్టాప్ పై వాట్సప్ ఉపయోగించే వారికి ప్రతి ఆరు గంటలకు తిరిగి లాగిన్ అవ్వడం సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు, ప్రయాణ సమయాల్లో నెట్వర్క్ లేని సమయంలో డ్యూయల్ సిమ్ వాడే వారికి వాట్సాప్ కొత్త సమయం తాత్కాలికంగా వాట్సాప్ వాడకం నిలిచిపోతుంది. ఇక నుంచి ఒకే నెంబర్ తో చాలా ఫోన్స్ లో వాట్సాప్ వాడకం అసాధ్యం అవుతుంది.