BSNL రూ.1 రూపాయికే తెచ్చిన 30 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ రేపటితో క్లోజ్ అవుతుంది.!
ఆగస్టు 15 2025 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ రేపటితో ముగుస్తుంది
కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందించే విధంగా తీసుకొచ్చిన ప్లాన్
ఈ BSNL ప్రీపెయిడ్ ప్లాన్ రేపటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
BSNL Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆగస్టు 15 2025 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ రేపటితో ముగుస్తుంది. కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందించే విధంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ చివరి తేదీని ఆగస్టు 31వ తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రేపటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ఎవరి కోసం అందించారు, ఎవరు రీచార్జ్ చేసుకోవచ్చు మరియు ఈ ప్లాన్ ప్రయోజనాలు వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.
SurveyBSNL Plan: ఏమిటి ఈ బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్
2025 ఆగస్టు 15 సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ని ప్రకటించింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ప్లాన్ మరియు కేవలం ఒక నెల లిమిట్ తో మాత్రమే అందించబడింది. ఇదే ప్లాన్ ని బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ గా కూడా పిలుస్తారు.
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ అందించే లాభాలు ఏమిటి?
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసి యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు 30 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 ఎస్ఎంఎస్ వినియోగ సౌలభ్యం కూడా అందిస్తుంది. ఇవన్నీ కూడా కేవలం రూ. 1 రూపాయికే ఆఫర్ చేస్తుంది. మరింత గొప్ప విషయం ఏమిటంటే, ఉచిత SIM కార్డు కూడా అందిస్తుంది.
Also Read: RIL AGM 2025 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో Jio Frames లాంచ్ చేసిన జియో.!
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఎవరు చేసుకోవచ్చు?
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ అనేది కొత్త సిమ్ కార్డు తీసుకునే యూజర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్. అంటే, కొత్తగా సిమ్ కార్డు తీసుకునే యూజర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. అంటే, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్లాన్ ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెంబర్ వాడుతున్న వారికి కాకుండా కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి మారాలని చూస్తున్న వారికి ఇది నిజంగా చాలా గొప్ప ఆఫర్ గా ఉంటుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కొత్త టవర్స్ నిర్వహించి వేగంతమైన 4G నెట్ వర్క్ తో చవక ధరలో బీఎస్ఎన్ఎల్ సర్వీస్ అందిస్తోంది. ఇది కాకుండా రానున్న నెలల్లో దేశం మొత్తం 4G కవరేజ్ తీసుకురావడమే కాకుండా క్వాంటం 5G (Q-5G) కోసం కూడా బీఎస్ఎన్ఎల్ వేగంగా పని చేస్తోంది.