BSNL: రూ. 200 కంటే తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

BSNL: రూ. 200 కంటే తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

BSNL: టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత టెలికాం యూజర్స్ కళ్ళు బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ పైన పడుతున్నాయి. ఎందుకంటే, అతి చవక దరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ అందిచే ఏకైక టెలికాం కంపెనీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రూ. 200 ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం వెతికే వారిలో మీరు ఉన్నట్లయితే ఈ ప్లాన్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

కేవలం రూ. 200 కంటే చవక ధరలో ఎక్కువ లాభాలను అందించే బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 197 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. బడ్జెట్ ధరలో అధిక వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు ఈ ప్లాన్ తో కాలింగ్, డేటా మరియు SMS వంటి మరిన్ని ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 15 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందుకుంటారు.

BSNL Rs. 197 Prepaid Plan

ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లు 15 రోజుల పాటు డైలీ 2GB డేటా (40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేట్) మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా 15 రోజుల పాటు పొందుతారు. అయితే, ఈ 15 రోజుల ఉచిత ప్రయోజనాల గడువు ముగిసిన తర్వాత లోకల్ కాల్ కి నిమిషానికి రూ. 1, STD కాలింగ్ కోసం నిమిషానికి రూ. 1.30, డేటా కోసం 25p/MB రేట్లు వర్తిస్తాయి.

Also Read: TRAI: సెప్టెంబర్ 1 నుంచి OTP ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం.. ఎందుకంటే.!

ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆఫర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ లతో పోలిస్తే, ఈ ప్లాన్ అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా నిలుస్తుంది.

లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు చెక్ చేయడానికి లేదా మొబైల్ నెంబర్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo