BSNL New Plan rs 599 offers 70 days unlimited benefits
BSNL New Plan: దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థగా విస్తరిస్తున్న BSNL తన వినియోగదారుల కోసం అనేక బెస్ట్ ప్లాన్స్ ఆఫర్ చేసింది. వీటిలో చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అతి తక్కువ ఖర్చులో గొప్ప బెనిఫిట్స్ అందిస్తాయి. వీటిలో ఒక ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 600 రూపాయల కంటే తక్కువ ఖర్చులో 70 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక లాభాలు అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తోంది. అధిక డేటా వినియోగించే వారు, వీడియో స్ట్రీమింగ్, ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్ వంటి అవసరాలు ఉన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను రూపొందించింది.
బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం సరి కొత్తగా అందించిన రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం అత్యంత విలువైన రీఛార్జ్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అతి తక్కువ ఖర్చుతో 70 రోజులు అధిక డేటా మరియు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వినియోగదారులు 70 రోజుల వ్యాలిడిటీ అందుకుంటారు. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా మరియు దేశం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుకుంటారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనం కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో మొత్తం వ్యాలిడిటీ కాలంలో దాదాపు 210GB ల హై స్పీడ్ డేటా లభిస్తుంది.
ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, అధిక డేటా అందించడం వల్ల ఈ ప్లాన్ విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది. ముఖ్యంగా డేటా మరియు కాలింగ్ రెండూ సమానంగా అవసరమయ్యే వారికి బిఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్ బెస్ట్ వాల్యూ రీఛార్జ్ గా ఉంటుంది.
Also Read: Lava Bold N2 5G: చవక ధరలో భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!
ప్రస్తుతం, దేశం మొత్తం గొప్ప నెట్ వర్క్ శక్తిని నిర్మించిన తర్వాత బిఎస్ఎన్ఎల్ యూజర్ బేస్ కూడా వేగంగా పుంజుకుంటోంది. బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ మరియు ప్లాన్స్ తో బిఎస్ఎన్ఎల్ మరింత వేగంగా యూజర్లను ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా, కేవలం రూ. 1 రూపాయికే నెల రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లను తెచ్చిపెట్టిన బెస్ట్ ప్లాన్ గా నిలిచింది.