Lava Bold N2 5G: చవక ధరలో భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

Lava Bold N2 5G చవక ధరలో భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది

లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది

మొదటి రోజు సేల్ నుంచి ఈ ఫోన్ లాంచ్ డే డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది

Lava Bold N2 5G: చవక ధరలో భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!

Lava Bold N2 5G : లవ్ ఈరోజు తన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ చేసింది. అదే లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. లావా ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ . 12,000 ప్రైస్ సెగ్మెంట్ యూజర్ ను టార్గెట్ చేసి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Bold N2 5G: ప్రైస్

లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ ను రూ. 1,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరలో ఆఫర్ చేస్తుంది. జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు సేల్ నుంచి ఈ ఫోన్ ఈ లాంచ్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ఫోన్ రాయల్ గోల్డ్ మరియు బిలియనీర్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది.

Aslo Read: Realme P4R 5G: లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ

Lava Bold N2 5G: ఫీచర్స్

లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ సరికొత్త స్టైలిష్ డిజైన్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6.75 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. లావా ఈ కొత్త ఫోన్ ను Unisoc T8200 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 4జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది.

Lava Bold N2 5G

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ మంచి ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని లావా తెలిపింది. ఈ ఫోన్ లో 6000 mah భారీ బ్యాటరీ ని లావా అందించింది. ఈ ఫోన్ టైప్ C ఛార్జింగ్ పోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో కూడా లావా ఫ్రీ హోమ్ సర్వీస్ ను అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile