Realme P4R 5G: లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ
రియల్‌మీ P4Rఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ సైతం ఈ రోజు ప్రకటించింది
ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ లో AI సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది
Realme P4R 5G: రియల్‌మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ P4Rఇండియా లాంచ్ డేట్, టైం మరియు కీలక ఫీచర్స్ సైతం ఈ రోజు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు ఆకట్టుకునే ఇతర ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
SurveyRealme P4R 5G: లాంచ్ డేట్?
రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ ను జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు డేట్ మరియు టైం రివీల్ చేసింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ఫ్లిప్ కార్ట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది..
Realme P4R 5G: ఫీచర్స్
రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ MIl STD 810H మిలటరీ గ్రీడ్ డ్యూరాబిలిటీ డిజైన్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో రియల్ గేమింగ్ కోసం తగిన డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ సెట్ పవర్ తో లాంచ్ చేస్తుంది.

ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో జతగా Hyper Vision+ AI చిప్ తో కూడా ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ లో 14GB డైనమిక్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ వేడెక్కకుండా చూసుకునే పెద్ద ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్ వేర్ తో లాంచ్ చేస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో AI సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది AI పోర్ట్రైట్ గ్లో, AI ఎరేజర్ మరియు మరిన్ని లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో రియర్ కెమెరాతో జతగా సరికొత్త AI పల్స్ లైట్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో కూడా ఉంటుంది.
Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ రూ. 10,000 డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!
ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ గురించి కంపెనీ చాలా ప్రత్యేకంగా మరియు గొప్ప తెలిపింది. ఈ ఫోన్ లో 8000 mAh భారీ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ బ్యాటరీ 4 లేయర్ సేఫ్టీ ఫీచర్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ బ్యాటరీ 7 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో 45W ఫాస్ట్ ఛార్జ్, బైపాస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 27W వరకు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
