BSNL జబర్దస్త్ అఫర్: రూ.400 కంటే తక్కువ రీఛార్జ్ కే 10నెలల వ్యాలిడిటీ

HIGHLIGHTS

BSNL కస్టమర్లకు అతితక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్

ఈ ప్లాన్స్ చాలా తక్కువ ధరలో ఎక్కవ వ్యాలిడిటీని తీసుకువస్తాయి

అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు మరిన్ని లాభాలను కూడా పొందవచ్చు

BSNL జబర్దస్త్ అఫర్: రూ.400 కంటే తక్కువ రీఛార్జ్ కే 10నెలల వ్యాలిడిటీ

BSNL కస్టమర్లకు అతితక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందుబాటులో ఉంచింది. వీటిలో రూ.106, రూ.197 మరియు రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ గా చెప్పవచ్చు. ఈ ప్లాన్స్ చాలా తక్కువ ధరలో ఎక్కవ వ్యాలిడిటీని తీసుకువస్తాయి. అందులోను రూ.397 రూపాయల  ప్లాన్ ఏకంగా 10 నెలల వ్యాలిడిటీని అందిస్తుంది. అంతేకాదు, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు మరిన్ని లాభాలను కూడా పొందవచ్చు. అందుకే, BSNL కస్టమర్లకు ఎక్కువ లాభాలను అందిస్తున్న ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ గురించి ఈరోజు చూద్దాం.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.397 రూపాయల ప్లాన్ తో కస్టమర్లకు పూర్తి 300 రోజుల వ్యాలిడిటీ అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే, తక్కువ ధరలో ఎక్కవ లాభాలను అందించే రూ.106, రూ.197 ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు.    

BSNL రూ. 106 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్‌ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది.   

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo