BSNL: అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో సహా అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో సహా అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్

BSNL బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ అందించిన ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా

BSNL: అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో సహా అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్.!

అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో సహా అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ BSNL ప్లాన్స్ పైన ఒక లుక్కేయండి. బిఎస్ఎన్ఎల్ యొక్క కొన్ని ప్లాన్స్ యూజర్లకు డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని లాభాలను అఫర్ చేస్తున్నాయి. వీటిలో రెండు బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు వివరంగా చూడనున్నాము. మరి బిఎస్ఎన్ఎల్ అందించిన ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈరోజు మనం చూడనున్న ఆ రెండు ప్లాన్స్  రూ. 499 మరియు రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్స్. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలు క్రింద చూడవచ్చు. 

BSNL రూ. 499 ప్లాన్:

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ 75 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS లను అందిస్తుంది. వీటితో పాటుగా, ఈ ప్లాన్ తో ఉచితంగా అందించే మరికొన్ని లాభాలు ఉన్నాయి. ఈ ప్లాన్ తో మీకు BSNL ట్యూన్స్, Zing యాక్సెస్ మరియు GAMEIUM ప్రీమియం అప్లికేషన్ యాక్సెస్ ను కూడా బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తోంది.

BSNL రూ. 599 ప్లాన్:

వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ పేరుతో బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ కూడా యూజర్లకు రోజు వారి అవసరాలకు తగిన అన్ని సౌకర్యాలతో వస్తుంది. ఈ ప్లే తో మీకు 84 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 3GB డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ తో Zing యాక్సెస్, PRBT, Astrotell మరియు గేమ్ ఆన్ అప్లికేషన్ యాక్సెస్ తో పాటుగా రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకూ ఉచిత అన్లిమిటెడ్ డేటావినియోగ లాభాలను బిఎస్ఎన్ఎల్ అజాత చేసింది. 

మరిన్ని BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo