BSNL Freedom 2.0: ఒక్క రూపాయికే అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరొక సరికొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది
ఈ కొత్త ఆఫర్ తో రీచార్జ్ చేసే యూజర్లకు ఏకంగా 24 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
ఇది కొత్త మొబైల్ కస్టమర్ల కోసం బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన పరిమిత కాల ప్రమోషనల్ ఆఫర్
BSNL Freedom 2.0: టెలికాం రంగంలో దూసుకుపోతున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరొక సరికొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది. అదే, సరికొత్తగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్. ఈ కొత్త ఆఫర్ తో రీచార్జ్ చేసే యూజర్లకు ఏకంగా 24 రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ సరికొత్తగా అందించిన ఈ బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ ఏమిటో చూద్దామా.
SurveyBSNL Freedom 2.0 ఆఫర్ ఏమిటి?
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ అని అందించింది. ఇది గత సంవత్సరం అందించిన ఫ్రీడమ్ ప్లాన్ మాదిరిగా ఉంటుంది. అయితే, గత ఆఫర్ 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తే, ఈ ప్లాన్ 24 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుంది.

ఇక ఈ ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఇది కొత్త మొబైల్ కస్టమర్ల కోసం బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన పరిమిత కాల ప్రమోషనల్ ఆఫర్. ఈ ఆఫర్ తో కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లకు కేవలం ఒక్క రూపాయికే కొత్త SIM కనెక్షన్ అందించడంతో పాటు కొత్త యూజర్ సర్వీస్ లో భాగంగా 24 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉచితంగా అందిస్తుంది.
Also Read: Hot Dal: కేవలం 40 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart TV అందుకోండి.!
BSNL Freedom 2.0 ఆఫర్ బెనిఫిట్స్
ఇక ఈ బిఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ఆఫర్ తో యూజర్లకు 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 24 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ఆఫర్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్ ను కూడా అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ తో అందించే డైలీ 1GB హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
అంటే, ఈ లేటెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ఆఫర్ ప్లాన్ తో కేవలం ఒక్క రూపాయికే ఏ 40 రోజులు అన్లిమిటెడ్ లాభాలు మరియు ఉచిత SIM కార్డు ని కూడా మీకు అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
