BSNL Diwali Offer: పండుగ సందర్భంగా వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పై డిస్కౌంట్ అందుకోండి.!
BSNL Diwali Offer ను అనౌన్స్ చేసింది
ఈ ఆఫర్ తో వన్ ఇయర్ ప్లాన్ మరింత చవక అవుతుంది
ఈ ఆఫర్ ద్వారా యూజర్లకు అధిక లాభాలు కూడా అందుతాయి
BSNL Diwali Offer ను అనౌన్స్ చేసింది మరియు ఈ ఆఫర్ తో వన్ ఇయర్ ప్లాన్ అవుతుంది మరింత చవక. 2024 దీపావళి పండుగ సందర్భంగా అందించిన ఈ ఆఫర్ ద్వారా యూజర్లకు అధిక లాభాలు కూడా అందుతాయి. పండుగ కోసం బిఎస్ఎన్ఎల్ అందించున ఈ ఆఫర్ మరియు ఈ ఆఫర్ తో వచ్చే ఆ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
SurveyBSNL Diwali Offer
దీపావళి 2024 సందర్భంగా బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం ఈ కొత్త ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ ను రూ. 1,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ పై అందించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ యూజర్లకు రూ. 100 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 1,899 రూపాయలకే లభిస్తుంది.

అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ తగ్గింపు ఆఫర్ ను కేవలం లిమిటెడ్ పిరియడ్ టైమ్ కోసమే బిఎస్ఎన్ఎల్ అందించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వ తేదీ లోపు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది.
Also Read: iMac 24 Inch ను పవర్ ఫుల్ M4 Chip తో లాంచ్ చేసిన యాపిల్.!
BSNL Rs. 1,999 (ప్రస్తుతం రూ. 1,899 ప్లాన్)
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులకు గాను 600GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ లిమిటెడ్ డేట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా లభిస్తుంది.
పైన తెలిపిన ప్రయోజనాలు కాకుండా ఈ ప్లాన్ తో మరిన్ని ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో హార్డీ గేమ్స్, ఛాలంజెర్ అరేనా గేమ్స్, Gameon ఆస్ట్రాటెల్లర్, Gameium, Lystn Podocast, Zing మ్యూజిక్, 365 రోజుల BSNL Tunes యాక్సెస్ మరియు WOW Entertainment వంటి ప్రయోజనాలు అందిస్తుంది.
మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile