Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ BBD Sale

HIGHLIGHTS

Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది

గూగుల్ పిక్సెల్ 11 ను కేవలం రూ. 69,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు

ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఇది ఏకంగా రూ. 20,000 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ BBD Sale

Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్టార్టింగ్ వేరియంట్ ను కేవలం రూ. 69,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ BBD Sale డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఇది ఏకంగా రూ. 20,000 రూపాయల డిస్కౌంట్ ధర అవుతుంది. అందుకే, ఈ డీల్ ని ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ‘Big Bang’ డీల్ గా పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel 11 ఆఫర్ ఏమిటి?

గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 89,999 ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ ఫోన్ పై అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 69,999 డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది. అంతేకాదు, ఈ డీల్ ని విష్ లిస్ట్ లో యద చేసుకోవచ్చని కూడా తెలిపింది.

BBD Sale Google Pixel 11 Deal

ఈ ఫోన్ ఈరోజు కూడా లాంచ్ ప్రైస్ అయిన రూ. 89,999 రూపాయల ధరతో సేల్ ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 12,000 రూపాయల భారీ ICICI అండ్ Axis బ్యాంక్ `క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈరోజు కూడా కేవలం రూ. 77,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. మరి బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఇంకా ఎటువంటి ఆఫర్స్ ఈ ఫోన్ పైన జత చేస్తుందో చూడాలి.

Also Read: HMD vibe 2 Pro 5G ఆల్ న్యూ డిజైన్ మరియు Sony కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

Google Pixel 11 : ఫీచర్స్

ఈ ఫోన్ లో 6.3 అంగుళాల Actua OLED డిస్‌ప్లే ని గూగుల్ అందించింది. ఇది FHD ప్లస్ పిక్సెల్ రిజల్యూషన్, 422 PPI, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ నుంచి 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు ఉండటంతో ఎండలో కూడా ఈ స్క్రీన్‌ను స్పష్టంగా చూడవచ్చు. గూగుల్ ఈ ఫోన్ ను మంచి పెర్ఫార్మెన్స్ కోసం గూగుల్ Tensor G6 చిప్, Titan M3 సెక్యూరిటీ చిప్ తో అందించింది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ తో జతగా 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్లు అందించింది.

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ వైడ్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ టెలిఫోటో కెమెరా 5x ఆప్టికల్ జూమ్‌ తో పాటు 30x Super Zoom కు సపోర్ట్ చేస్తుంది. మెయిన్ మరియు టెలిఫోటో కెమెరాల్లో ఆప్టికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందుబాటులో ఉంది. ముందు భాగంలో 10.5MP AF సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాతో కెమెరాతో 4K వీడియోను 30/60fps వద్ద వీడియో రికార్డ్ చేయవచ్చు.

ఈ ఫోన్ లో 4,985mAh బ్యాటరీ ఉంది మరియు ఇది 30 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుందని గూగుల్ తెలిపింది. ఇందులో 30W USB-C PPS ఛార్జర్‌ తో సుమారు 30 నిమిషాల్లో 55 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే Qi2.2 ఆధారిత Pixelsnap వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా 25W వరకు ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile