BSNL నామమాత్రపు రేట్లకే ఆఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే.!
BSNL బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్
BSNL ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్
అతి తక్కువ బడ్జెట్ లో లభించే బెస్ట్ లాంగ్ ప్లాన్స్
BSNL 2025 సంవత్సరంలో కూడా అతి చవక రేటుకే ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న బెస్ట్ టెలికాం కంపెనీగా కొనసాగుతోంది. ఒకపక్క 4G నెట్ వర్క్ ను వేగంగా విస్తరిస్తూనే 5G కోసం ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటికి కూడా చాలా తక్కువ రేట్లకే లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు ఆఫర్ చేస్తూనే ఉంది. అటువంటి బిఎస్ఎన్ఎల్ నామమాత్రపు రేట్లకే ఆఫర్ చేస్తున్న బెస్ట్ లాంగ్ వాలిడిటీ ప్లాన్స్ ఈరోజు చూద్దాం.
SurveyBSNL బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆఫర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ లో రూ. 397, రూ. 797 మరియు రూ. 897 మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి.
రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 30 రోజుల ఉచిత ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటాని ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ ఉచిత లాభాలు ముగిసిన తర్వాత రెగ్యులర్ కాల్, డేటా మరియు SMS రేట్లు వర్తిస్తాయి. అయితే, ఈ ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 150 రోజులు ఉంటుంది.

రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజులు చెల్లుబాటు అవుతోంది. అలాగే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 60 రోజులు పాటు ఉచిత ప్రయోజనాలు కూడా అందుతాయి. అవేమిటంటే, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS మరియు 2GB హాయ్ స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు, డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ ఉచిత ప్రయోజనాలు 60 రోజులు మాత్రమే అందిస్తుంది. అయితే, వ్యాలిడిటీ మాత్రం 300 రోజులు అందిస్తుంది.
Also Read: Honor 200 5G ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 14 వేల భారీ డిస్కౌంట్ తో 20 వేల ధరకే లభిస్తోంది.!
రూ. 897 ప్రీపెయిడ్ ప్లాన్
ఇక ఈ రూ. 897 రూపాయల ప్రీపెయిడ్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ 180 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి 90GB హై స్పీడ్ డేటా అందిస్తుంది మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత ప్రయోజనాలు ముగిసిన తర్వాత రెగ్యులర్ ఛార్జ్ లు వర్తిస్తాయి.
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here