BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్: రూ.397 కే సంవత్సరమంతా సర్వీస్

HIGHLIGHTS

Rs.397 రూపాయలకే పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్

రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది

BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్: రూ.397 కే సంవత్సరమంతా సర్వీస్

BSNL చాలా తక్కువ ఖర్చుతో తన కస్టమర్లకు బెస్ట్ అఫర్ అందించింది. ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ అందుతుంది.  ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.   

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి         

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo