BSNL: తక్కువ ఖర్చులో 10GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ అఫర్.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 24 Mar 2023 11:27 IST
HIGHLIGHTS
  • తక్కువ ఖర్చులో 10GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్

  • భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బెస్ట్ అఫర్

  • ఈ ప్లాన్ తో 30 రోజులు నిశ్చింతగా ఉండవచ్చు

BSNL: తక్కువ ఖర్చులో 10GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ అఫర్.!
BSNL: తక్కువ ఖర్చులో 10GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ అఫర్.!

తక్కువ ఖర్చులో 10GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ అఫర్ ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు అఫర్ చేస్తోంది. కేవలం రూ.147 ఖర్చుతోనే ఈ అఫర్ ద్వారా 30 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా 10GB డేటా ప్రయోజనాన్ని కూడా అందుకోవచ్చు.  బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ అందిస్తున్న అన్ని ప్రయోజనాలను గురించి తెలుసుకుందామా.      

BSNL Rs.147 Plan: 

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ లలో ఒకటిగా చెబుతారు. ఈ ప్లాన్ రీచార్జ్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అంటే, పూర్తిగా 30 రోజులు హోమ్ నెట్ వర్క్ మరియు ముంబై, ఢిల్లీ (MTNL) లలో కూడా రోమింగ్ లో కూడా ఎటువంటి చింతా లేకుండా కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో 10GB డేటా ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. 

ఇక ఇటివంటి మరొక బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసినట్లయితే, మీరు రూ.1,198 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

BSNL Rs.1,198 Plan:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

bsnl best plan with 10gb data and unlimited calling

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు