BSNL: నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.!
బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ఇప్పుడు దేశం మొత్తం విస్తరించింది
యూజర్లకు తగిన గొప్ప లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ లాభాలు కూడా అందించింది
నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్
BSNL: బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ఇప్పుడు దేశం మొత్తం విస్తరించింది. గతంలో నెట్వర్క్ ఇష్యూ గురించి అనేక కంప్లెయింట్ అందుకున్న బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు దేశం మొత్తం తన 4జి సేవలు విస్తరించింది. కేవలం విస్తరణ మాత్రమే కాదు బీఎస్ఎన్ఎల్ యూజర్లకు తగిన గొప్ప లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ లాభాలు కూడా అందించింది. టెలికాం ఇండస్ట్రీ లో పెరిగిన టారిఫ్ రేట్లు నుంచి ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉపశమనంగా ఉంటునాయి. అందులో, అన్లిమిటెడ్ లాభాలు చాలా తక్కువ ఖర్చుతో కోరుకునే వారికి కూడా బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో, నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
SurveyBSNL : ఏమిటి రూ. 200 ఖర్చుతో వచ్చే ప్లాన్?
బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన వన్ ఇయర్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 గురించే మేము ఇప్పుడు చెబుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్ గా ఉంటుంది. ఈ ప్లాన్ ను కు చెల్లించే మొత్తం అమౌంట్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ. 200 రూపాయలే అవుతుంది. అయితే, ఈ ప్లాన్ ఇంత తక్కువ ధరలో యూజర్లకు గొప్ప అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 2399 ప్లాన్ బెనిఫిట్స్
బీఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం డైలీ 100 SMS ప్రయోజనం కూడా అందిస్తుంది.

ఒకవేళ ఇంకా తక్కువ ఖర్చుతో లాంగ్ వ్యాలిడిటీ కోరుకుంటే మరో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా మీకు అందుబాటులో ఉంది. అదే, బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ క్రింద చూడవచ్చు.
Also Read: Flipkart Sale నుంచి ఈరోజు Philips Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
బీఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్లాన్ బెనిఫిట్స్
ఈ బీఎస్ఎన్ఎల్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ 330 రోజులు వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ 330 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది. డేటా పరంగా, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 1.5 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది మరియు ఈ డైలీ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా మీకు అందిస్తుంది.