BSNL: రూ. 250 కంటే తక్కువ రేటులో నెల రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్.!
కేవలం రూ. 250 రూపాయల కంటే తక్కువ రేటులో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్
తక్కువ ఖర్చులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
రూ. 250 కంటే తక్కువ రేటుకు చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్ల కోసం అందించింది
BSNL : కేవలం రూ. 250 రూపాయల కంటే తక్కువ రేటులో నెల రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం కంపెనీగా బీఎస్ఎన్ఎల్ మాత్రమే నిలుస్తుంది. ముందు నుంచి బడ్జెట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 4g నెట్‌వర్క్ తీసుకొచ్చిన వేగంలో మరిన్ని కొత్త గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా తన యూజర్ల కోసం అందించింది.
SurveyBSNL : రూ. 250 బెస్ట్ ప్లాన్స్
బీఎస్ఎన్ఎల్ 250 కంటే తక్కువ రేటుకు చాలా ప్లాన్స్ తన యూజర్ల కోసం అందించింది. వీటిలో, రూ. 225 పవర్ ప్లాన్, 228 రెగ్యులర్ అన్లిమిటెడ్ ప్లాన్, రూ. 199 బడ్జెట్ ప్లాన్, 229 పవర్ ప్లాన్ మరియు ఇటీవల స్టూడెంట్స్ కోసం ప్రకటించిన లేటెస్ట్ రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి.
రూ. 229 అండ్ రూ. 225 పవర్ ప్లాన్స్
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా పేరుకు తగ్గట్టుగా పవర్ ఫుల్ ఉంటాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా 30 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. వీటిలో, రూ. 225 ప్లాన్ రోజుకు 2.5 జీబీ హై స్పీడ్ డేటా మరియు రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేట్ ఆఫర్ చేస్తాయి. ఈ రెండు ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100SMS వినియోగ ప్రయోజనం అందిస్తాయి.

రూ. 199 మరియు రూ. 228 ప్రీపెయిడ్ ప్లాన్స్
ఈ రెండు ప్లాన్స్ కూడా దాదాపు ఒకే విధమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డైలీ 2 జీబీ హాయ్ స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే, రూ. 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు కలిగి ఉంటే, రూ. 228 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం 30 రోజులు చెల్లుబాటు అవుతుంది.
Also Read: Jio Free offer: ఇక అందరికీ 18 నెలలు ఉచితం.. వెంటనే క్లెయిమ్ చేసుకోండి.!
BSNL రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్
ఇక ఈ ప్రత్యేకమైన బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ తక్కువ రేటుకే ఎక్కువ డేటా అందించే ప్లాన్ గా ఉంటుంది. ఈ ప్లాన్ ను రీసెంట్ గా నవంబర్ 14వ తేదీ చిల్డ్రన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ టోటల్ 100 జీబీ హై స్పీడ్ డేటా తీసుకు వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100SMS లను కూడా అందిస్తుంది.
మీరు గమనించవలసిన మరో విషయం ఉంది. అదేమిటంటే, పైన తెలిపిన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అందిస్తాయి.