BSNL జబర్దస్త్ అఫర్: రూ.797 ధరకే 425 రోజుల వ్యాలిడిటీ ప్లాన్..!!

HIGHLIGHTS

BSNL కస్టమర్ల కోసం జబర్దస్త్ అఫర్ ను ప్రకటించింది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 425 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది

రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది

BSNL జబర్దస్త్ అఫర్: రూ.797 ధరకే 425 రోజుల వ్యాలిడిటీ ప్లాన్..!!

BSNL తన కస్టమర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే జబర్దస్త్ అఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే బి ఎస్ఎన్ఎల్ యూజర్లకు చవక ధరలోనే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సరసన మరొక బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ను కూడా బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం జత చేసింది. ఈ ప్లాన్ ను రూ.797  రూపాయలకు అందించింది. అయితే,ఈ ప్లాన్ ఇంత తక్కువ ధరకే సంవత్సరం కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ లాభాన్ని అందిస్తుంది. అందుకే, ఈరోజు తక్కువ ధరకే లాంగ్ వ్యాలిడిటీ, కాలింగ్ మరియు డేటా లాభాలను అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ గురించిచూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 425 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.

పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo