BSNL 2026 Offer: ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో డైలీ 500MB అదనపు డేటా అందుకోండి.!

HIGHLIGHTS

2026 కొత్త సంవత్సరంలో యూజర్లకు మరింత ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్స్

బిఎస్ఎన్ఎల్ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ పై డైలీ 500MB అదనపు డేటా ప్రకటించింది

ఈ కొత్త సంవత్సరం ఆఫర్ తో రోజు అందుకునే డేటా తో పాటు అదనపు డేటా కూడా లభిస్తుంది

BSNL 2026 Offer: 2026 కొత్త సంవత్సరంలో యూజర్లకు మరింత ఎక్కువ ప్రయోజనాలు అందించే ఆలోచనతో, బిఎస్ఎన్ఎల్ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ పై 500MB అదనపు డేటా ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ కొత్త సంవత్సరం ఆఫర్ తో రోజు అందుకునే డేటా తో పాటు అదనపు డేటా కూడా లభిస్తుంది. కొత్త సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

BSNL 2026 Offer:

బిఎస్ఎన్ఎల్ 2026 ప్రారంభం లో ఈ కొత్త ఆఫర్ ను అందించింది. ఈ కొత్త ఆఫర్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 225, రూ. 347, రూ. 485 మరియు రూ. 2,399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ పై డైలీ 500MB హై స్పీడ్ డేటా అదనంగా ప్రకటించింది. అంటే, ఈ నాలుగు ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ప్లాన్ తో వచ్చే డైలీ డేట్ కాకుండా 500MB డేటా అదనంగా (ఉచితం) లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు మనకు తెలిసాయి. మరి ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 3GB (2.5GB + 500MB) హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం 30 రోజులు అందిస్తుంది. ఈ డైలీ 3 జీబీ హై స్పీడ్ డేటా లిమిట్ క్లోజ్ అయిన తర్వాత కూడా 40Kbps తో రోజంతా అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది.

రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది బిఎస్ఎన్ఎల్ అందించిన లాంగ్ టర్మ్ ప్లాన్ మరియు డి 56 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 50 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB (2GB + 500MB) హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 40Kbps తో రోజంతా అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది.

రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ కూడా పైన తెలిపిన రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని బెనిఫిట్స్ 72 రోజులు అందిస్తుంది అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 72 రోజులు డైలీ 2.5జీబీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS బెనిఫిట్స్ 72 రోజులు అందుకుంటారు.

Also Read: 10 Minute Delivery: 10 నిమిషాల డెలివరీకి బ్రేకులు వేసిన కేంద్రం.!

రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్

ఇది వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో రీఛార్జ్ స్ చేస్తే పూర్తిగా సంవత్సరం మొత్తం రోజుకు 500MB అదనపు డేటా చొప్పున ఏకంగా 182.5GB డేటా ఉచితంగా అందుకోవచ్చు. అంటే, ఈ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ డైలీ 2.5 జీబీ డేటా మరియు డైలీ 100SMS లాభాలు అందుకోవచ్చు.

అయితే, ఈ అదనపు డేటా ఆఫర్ కేవలం ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :