రూ.100 లోపు జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ పై లుక్ వేయండి.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 18 Nov 2022
HIGHLIGHTS
  • టెలికం కంపెనీలు తగిన లాభాలతో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి

  • తక్కువ ఖర్చుతో కూడా వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి

  • రూ.100 లోపు టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్

రూ.100 లోపు జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ పై లుక్ వేయండి.!
రూ.100 లోపు జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ పై లుక్ వేయండి.!

యూజర్లకు తక్కువ ధరలో కూడా టెలికం కంపెనీలు తగిన లాభాలతో మంచి ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. అంటే, జియో, ఎయిర్టెల్, BSNL మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం అన్ని కంపెనీలు కూడా బడ్జెట్ ధరలోనే మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందిస్తున్నాయి.  తద్వారా, కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడా వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ఈరోజు మనం  జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అదీకూడా రూ.100 లోపు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ చుడనున్నాము.

Jio యొక్క అత్యంత చవకైన ప్లాన్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అత్యంత చవకైన ప్లాన్ ను కేవలం రూ.25 రూపాయలకే అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 2GB డేటాని యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీతో పొందుతారు. ఇది కాకుండా జియో యొక్క రూ. 61 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా వుంది మరియు ఇది కూడా మీరు రీఛార్జ్ చేసిన యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటుతో 6GB డేటాను అందిస్తుంది.

BSNL యొక్క అత్యంత చవకైన ప్లాన్

BSNL యొక్క చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లలో మొదటిది 49 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ ప్లాన్‌ను సెకండరీ SIM కార్డ్‌ కోసం ఉపయోగించవచ్చు, ఇది మీ ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీరు రెండు SIM లను ఉపయోగించవచ్చు.

ఎయిర్టెల్ యొక్క అత్యంత చవకైన ప్లాన్

ఎయిర్టెల్ యొక్క అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, రూ.99. ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ ప్లాన్ తో కస్టమర్‌లు 28 రోజుల వ్యాలిడిటీని  రూ. 99 టాక్ టైమ్‌ను పొందుతారు. ఈ మొత్తాన్ని యూజర్లు కాల్ చేయడానికి లేదు మెసేజెస్ కోడం కూడా ఉపయోగించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌ తో కస్టమర్లు 200 MB డేటాను కూడా పొందుతారు.

వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క అత్యంత చవకైన ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు 98 రూపాయల ధరలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 14 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 200 MB డేటాను అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Best budget prepaid plans of jio aitrel bsnl and vi
Tags:
Jio Jio 4G Jio plans BSNL BSNL plans under rs 100 airtel recharge plans vi recharge plans recharge plans under rs 100
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements