ఎయిర్టెల్ ధమాకా అఫర్: భారీ డేటా ప్రయోజనాలతో చవక ప్లాన్ లాంచ్

HIGHLIGHTS

అధిక డేటా ప్రయోజనాలను అందించేలా బెస్ట్ ప్లాన్

ఇది డేటా రీఛార్జ్ ప్లాన్

మరిన్ని ఇతర లాభాలను కూడా అందిస్తుంది

ఎయిర్టెల్ ధమాకా అఫర్: భారీ డేటా ప్రయోజనాలతో చవక ప్లాన్ లాంచ్

ఎయిర్టెల్ తన కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అధిక డేటా ప్రయోజనాలను అందించేలా బెస్ట్ ప్లాన్  ప్రకటించింది. ఈప్లాన్ ను రూ.119 రూపాయల ధరతో ప్రకటించింది. ఇది డేటా రీఛార్జ్ ప్లాన్ మరియు ఇది 15GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ మరిన్ని ఇతర లాభాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే అన్ని లాభాలను గురించి చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎయిర్టెల్ రూ.98 డేటా ప్యాక్

ఈ ఎయిర్టెల్ రూ.119 డేటా ప్యాక్ ఎగ్జిస్టింగ్ ప్యాక్ వ్యాలిడిటీకి వర్తిస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 15GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. అధనంగా, ఈ డేటా ప్లాన్ తో 30 రోజుల ఉచిత ఎక్స్ ట్రీమ్ మొబైల్ ప్యాక్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఇది బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు వర్తిస్తుంది. ఇదే ప్రయోజాలతో కేవలం 98 రూపాయలకే ఎక్కువ డేటా అఫర్ చేసే మరొక ప్యాక్ కూడా వుంది.

ఎయిర్టెల్ రూ.98 డేటా ప్యాక్

ఈ ఎయిర్టెల్ రూ.98 డేటా ప్యాక్ కూడా కొనసాగుతున్న ఎగ్జిస్టింగ్ ప్యాక్ వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 12GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. ఇది బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు వర్తిస్తుంది.

ఎయిర్టెల్ కస్టమర్లకు చవక ధరలో మరిన్ని లాభాలను అందించే మరిన్ని ఇతర డేటా ప్లాన్స్ గురించి చూస్తే, రూ.48 మరియు రూ.89 డేటా ప్లాన్స్ కూడా వున్నాయి.       

ఎయిర్టెల్ రూ.48 డేటా ప్యాక్

ఈ ఎయిర్టెల్ రూ.48 డేటా ప్యాక్ కూడా కొనసాగుతున్న ఎగ్జిస్టింగ్ ప్యాక్ వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. ఇది బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు వర్తిస్తుంది

ఎయిర్టెల్ రూ.89 డేటా ప్యాక్

ఈ ఎయిర్టెల్ రూ.89 డేటా ప్యాక్ కూడా కొనసాగుతున్న ఎగ్జిస్టింగ్ ప్యాక్ వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 6GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. ఈ ప్యాక్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 28 రోజుల యాక్సెస్ మరియు Wynk Music సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇది బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ యూజర్లకు వర్తిస్తుంది. 

మరిన్ని బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo