ఇక మీ Whatsapp అకౌంట్ ఎవరూ చూడలేరు : మీ పర్సనల్ డేటాని మరింత సేఫ్ గా ఉంచుకోవచ్చు
క్యూరిటీ కోసం కొత్తగా తీసుకొచ్చిన ఈ 3 మూడు ఫీచర్లు మీకు చాలా ఉపయోగపడతాయి.
Whatsapp గురించి తెలియని వారు ఉండరంటే, అతిశయోక్తి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఆన్లైన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరితో మనల్ని కలిసేలా చెయ్యడంలో 'ఫేస్ బుక్' ప్రధాన పాత్ర వహిస్తే, మన పర్సనల్ లైఫ్ మనకు నచ్చిన వారితో గడపడానికి, వారికీ దగ్గరగా ఉండడానికి whatsapp దోహదం చేస్తుంది. మొబైల్ వాడేవారిలో, దాదాపుగా అందరికి ఈ whatsapp ఉంటుందనే చెప్పొచ్చు.
Surveyఅటువంటి, ఈ వాట్స్ ఆప్ నుండి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని అనివార్య ఇబ్బదులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటిని సరిచేసి, వాట్స్ ఆప్ చాలా కొత్త మార్పులను తీసుకొచ్చింది. వీటిలో మీ ప్రైవసీ మరియు సెక్యూరిటీ కోసం కొత్తగా తీసుకొచ్చిన ఈ 3 మూడు ఫీచర్లు మీకు చాలా ఉపయోగపడతాయి.
Finger Print Lock
ముందుగా, టచ్ ID మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను ఐఫోన్ వినియోగదారులకు తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా 'ఫింగర్ ప్రింట్ లాక్' ఫీచరును అందించింది. ఇది నిజంగా మంచి మార్పుగా చెప్పొచ్చు. దీనితో, కేవలం మీరు మాత్రమే మీ వాట్స్ ఆప్ మెసేజిలు మరియు డేటాని చూడవచ్చు. మీ ఫింగర్ ప్రింట్ లేకుండా వేరేవారు మీ వాట్స్ ఆప్ ఓపెన్ చేసే అవకాశముండదు. దీన్ని మీ ఫోనులో సెట్ చేసుకోవడానికి, మీ వాట్స్ ఆప్ లోని Settings లోకి వెళ్లి అందులోని Account ని సెలెక్ట్ చేసిన తరువాత Privacy ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత, ఈ ప్రైవసీలో అడుగు భాగాన Finger Print Lock అనే ఎంపిక కనిపిస్తుంది, దానిపైన నొక్కగానే మీకు Unlock With FingerPrint అనే అప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయగానే మీ ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మీ ఫింగర్ ప్రింట్ నమోదు చేయగానే, మీ అకౌంట్ ఇక కేవలం మీ ఫింగర్ ప్రింట్ తో మాత్రమే తెరుచుకుంటుంది.
Self -Distracting మెసేజి
Self -Distracting మెసేజి ఫీచర్ ద్వారా, వినియోగదారులు వాట్సాప్‌లో పంపే మెసేజిలు ఎంతకాలం డుండాలో కావాల్సిన సమయాన్ని ఎంచుకోవచ్చు, ఆ తర్వాత ఈ సందేశాలు ఆటొమ్యాటిగ్గా తొలగించబడతాయి. ఈ వాట్సాప్ యొక్క ఈ ఫీచర్ ఇప్పటికీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని మరియు కొంతమంది వాట్సాప్ బీటా వినియోగదారులు దీన్ని గ్రూప్ చాట్‌లో ఉపయోగించవచ్చని బ్లాగ్ చూపిస్తుంది. ఈ ఫీచర్ ప్రారంభించడానికి, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా దీన్ని చేయవచ్చు. ప్రస్తుతం, వాట్సాప్ 5 సెకన్లు మరియు 1 గంట అనే రెండు ఆప్షన్లను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గ్రూప్ చాట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే, ఈ ఫీచర్ రాబోయే సమయంలో ప్రైవేట్ చాట్‌లో కూడా ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారు అయితే, మీరు వాట్సాప్ బీటా యొక్క 2.19.175 వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Hide Mute స్టేటస్
వాట్సాప్ సరికొత్త ఆండ్రాయిడ్ బీటాలోఈ కొత్త ఫీచర్‌ను అందుకోనుంది, ఇది వచ్చిన తర్వాత మ్యూట్ స్టేటస్ పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ ఫీచర్ కొన్ని నెలల క్రితం డెవలప్పింగ్ లో కనిపించినప్పటికీ, ఇప్పుడు ఈ ఫీచర్ యొక్క పరీక్ష కూడా ప్రారంభమైంది. మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌డేట్ ఫీడ్ తో, వాట్సాప్ స్టేటస్ విభాగంలో మ్యూట్ చేయబడిన అన్ని స్టేటస్‌లు పోతాయి మరియు మ్యూట్ స్టేటస్ మీకు కనిపించదు, అయితే ఇది ఇంకా రాలేదు, మ్యూట్ చేయబడిన స్టేటస్ అప్‌డేట్ చూడటానికి స్క్రీన్ దిగువన స్క్రోల్ చేయండంతో చేయవచ్చు.