షావోమి రెడ్మి Y3 ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విడుదలకానుంది

Updated on 24-Apr-2019
HIGHLIGHTS

చాలా రూమర్లు మరియు అంచనాల తరువాత ఎట్టకేలకు, రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ ఈ రోజు విడుదలకానుంది.

రెడ్మి Y2 కంటే మెరుగైన సాఫ్ట్ వేర్ మరియు అప్డేట్లతో ఉండవచ్చని తెలుస్తోంది.

చాలా రూమర్లు మరియు అంచనాల తరువాత ఎట్టకేలకు,  రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ ఈ రోజు విడుదలకానుంది. ఈ స్మార్ట్ ఫోన్,  ముందుగా వచ్చినటువంటి రెడ్మి Y2 ఫోనుకు తరువాతి తరం ఫోనుగా రానుంది. అలాగే, రెడ్మి Y2 కంటే మెరుగైన సాఫ్ట్ వేర్ మరియు అప్డేట్లతో ఉండవచ్చని తెలుస్తోంది. రెడ్మి Y సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లు కాబట్టి  ఇందులో 32MP సెల్ఫీ కెమేరాను అందించారు. అలాగే, mi.com నుండి చూపిన అప్డటెడ్ వివరాల ప్రకారంగా, నీటి తుంపర్ల నుండి రక్షణ అందించే విధంగా, స్పిల్ ప్రూఫ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.  

షావోమి యొక్క ఇండియా ట్విట్టర్ పేజీలో అందించిన ఒక టీజింగ్ ప్రకరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 24 వ తేదికి ఇండియాలో అధికారికంగా విడుదలకానుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ఒక సెల్ఫీ బీస్ట్ గా రానున్నట్లు కూడా వెల్లడైనది. ముందునుండే అంచనా వేస్తున్నట్లుగా ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమేరాతో రానుంది. అంతేకాదు, ఈ టీజింగ్ ఫోటోలో అందించిన ప్రకారంగా ఈ ఫోను ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు అందులో అమర్చిన 32MP సెల్ఫీ కెమేరాతో రానున్నట్లు అర్ధమవుతోంది.

ఇక ఈ ఫోన్ పైన సంస్థ చూపిస్తున్నఅంచనాలను చూస్తే, 48MP రియర్ ప్రధాన కెమేరాను కూడా అందిచవచ్చేమో అనిపిస్తోంది. ఎందుకంటే, కేవలం ఇందులో బ్యాటరీ మరియు కెమేరాలను మాత్రమే ప్రధానాంశాలుగా చూపిస్తోంది. అంతేకాదు, మరొక విషయం ఏమిటంటే అందరికంటే ముందుగా ఒక 48MP కెమేరాను మిడ్ రేంజ్ ధరలో అందించి మార్కెట్ ని కొల్లగొట్టిన రెడ్మి నోట్ 7 ప్రో గురించి మనకు తెలుసు కదా!. అలాగే, ఇందులో కూడా అదే కెమేరా సెటప్పును ఒక శామ్సంగ్ GM1 సెన్సారుతో అందించవచ్చని కూడా అనేక రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :